గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 కార్యక్రమం జూలై 9,10 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతుందని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 (దక్షిణ రాష్ట్రల ఎడిషన్) ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ రాష్ట్రల ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారి వివిధ ఉత్పత్తుల ప్రదర్శన, స్టాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటుకు ,ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు తదితర అంశాలపైన, అవగాహనా సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME) తమ ఉత్పత్తులను విస్తృత మార్కెటింగ్ మరియు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుందని
తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, ప్రముఖ కంపెనీ యజమానులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న పరిశ్రమల యజమానులు ఉపయోగించుకోవాలని, తమ స్టాళ్ళ ఏర్పాటు చేసుకోవడం ద్వారా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచుకుని తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు https://regional.worldfoodindia.gov.in/Registrations/index.php వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 కార్యక్రమ వివరాలకు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు 7995086776 ఫోన్ నంబర్ కు
సంప్రదించవచ్చని వివరించారు.
Prajavartha Online Telugu News