Breaking News

పాల‌వాగులో నీటి ప్ర‌వాహం వేగంగా జ‌ర‌గాలి

-ఇంజినీరింగ్ అధికారుల‌కు ఏడీసీ సీఎండీ ఆదేశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయ‌పూడి నుంచి కృష్ణాయ‌పాలెం వ‌ద్ద కొండ‌వీటివాగులో క‌లుస్తున్న పాల‌వాగు ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను స‌త్వ‌రం పూర్తిచేయాల‌ని హ‌రిశచ్ఛంద్ర‌పురం పై ఎత్తు నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీటి ప్ర‌వాహం వేగంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్/మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు సంబంధి ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

శుక్ర‌వారం పాల‌వాగు ఆధునీక‌ర‌ణ పనుల‌ను కృష్ణాయ‌పాలెం నుంచి రాయ‌పూడి వ‌ర‌కు ప‌రిశీలించారు. కృష్ణాయ‌పాలెం శివాల‌యం గుడి వ‌ద్ద నీటి ప్ర‌వాహాన్ని ప‌రిశీలించారు. ఇదే గ్రామంలో ఎన్‌-4 బ్రిడ్జి కింద వెంట్ల‌లో పేరుకుపోయిన మ‌ట్టి తొల‌గింపు ప‌నుల‌ను ప‌రిశీలించారు. మ‌ట్టి తొల‌గింపు యంత్రాల‌ను అధిక సంఖ్య‌లో ఏర్పాటు చేసి వ‌ర‌ద నీటిని కృష్ణాయ‌పాలెం రిజ‌ర్వాయ‌ర్‌లోనికి పంపించాల‌ని బీఎస్‌సీపీఎల్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ అబ్దుల్ ఖాద‌ర్‌ను ఆదేశించారు.

వెంక‌ట‌పాలెం వ‌ద్ద ఈ – 5 రోడ్డు వ‌ద్ద పాల‌వాగు నీరు కింద‌కు వెళ్లేందుకు అడ్డుంకులు ఉన్న ప్ర‌దేశంలో ప్ర‌త్యామ్నాయ పైపులు ఏర్పాటు చేయాల‌న్నారు.

ఎన్‌-6 వెస్ట్‌బైపాస్ బ్రిడ్జి కింద మ‌ట్టి తొల‌గింపు ప‌నులు ఆశించిన స్థాయిలో జ‌ర‌గడం లేద‌ని అక్క‌డి ప్రాజెక్టు ఇన్‌ఛార్జ్ సాయి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్రిడ్జ కింద 15 మీట‌ర్ల వెడ‌ల్పు గ‌ల 3 వెంట్లు ఉండ‌గా మూడు రోజుల నుంచి ఒక వెంటు కింద మాత్ర‌మే అధాని సంస్థ ప్ర‌తినిధులు మ‌ట్టిని తీయ‌గ‌లిగారు. త‌క్కిన రెండు వెంట్ల కింద మ‌ట్టి తొల‌గింపు ప‌నులు ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌కపోవ‌టంతో సంబంధిత ప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హించారు. బ్రిడ్జి కింద పాల‌వాగు నీటి ప్ర‌వాహం ఆగిపోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మిస్తామ‌ని హెచ్చిరించారు.

మంద‌డంలోని ఎన్‌-7 వ‌ద్ద‌, మందడం గ్రామంలో పాల‌వాగు ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌రిశీలించారు. పాల‌వాగు దాటుతున్న మార్గాల‌లో పైపులు ఏర్పాటు చేసే ప‌నులు శీఘ్రంగా చేప‌ట్టాల‌ని సంబంధిత డీఈ వై.శ్రీ‌నివాస‌రావును ఆదేశించారు. ఉద్ధండ‌రాయుపాలెంలోని ఎన్‌-10, ఈ -4, హెచ్‌వోడీ ట‌వ‌ర్ల వ‌ద్ద ప్ర‌వ‌హిస్తున్న పేర‌మ్మ వాగు, రాయ‌పూడి పెరెడ్ గ్రౌండ్స్ వ‌ద్ద పాల‌వాగు మ‌ళ్లింపు ప‌నుల‌ను ప‌రిశీలించారు.

కుర‌గ‌ల్లు వ‌ద్ద ఈ-11 – వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కిందుగా కొండ‌వీటివాగు ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలించి వెంట్ల కింద మ‌ట్టి తొల‌గింపు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని మేగా ఇంజినీరింగ్ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. అక్క‌డి నుంచి ఎన్‌-9 పాల‌వాగు జంక్ష‌న్‌, ఇదే ప్రాంతంలో సీడ్‌యాక్సిస్‌రోడ్డు వ‌ద్ద చేప‌డుతున్న బాక్స్ క‌ల్వ‌ర్టు ప‌నుల‌ను ప‌రిశీంచారు. పాల‌వాగు ప్ర‌ధాన ప్రాంత‌మైన హెడ్‌స్లూయీజ్ ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు త‌గు ఆదేశాలు జారీచేశారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు బి.న‌ర‌సింహ‌మూర్తి, సీహెచ్ ధ‌నుంజ‌య‌, ఎస్ఈలు రామోహ‌న‌రావు, సీహెచ్‌.ర‌మేష్‌, ఈఈలు ఎస్‌.శ్రీ‌ధ‌ర్‌, కె.బ‌స‌వేశ్వ‌ర‌రావులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *