Breaking News

ఘనంగా రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవరం మంగోలు మరియు కృష్ణ ఫార్మసీ సొసైటీల ఆధ్వర్యంలో రైతులు మరియు డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా సొసైటీలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన చెక్కులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ “రైతులు మరియు డ్వాక్రా మహిళా సంఘాల అభివృద్ధే కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు లక్ష్యం లక్ష్యం. కేడీసీసీ బ్యాంక్ ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుంది. మూడు కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోంది” అని నెట్టెం రఘురాం అన్నారు.
అలాగే ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ “రైతు మరియు మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో మేము ముందుంటాం. రఘురాం  సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ మంచి సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.
అదేవిధంగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) చైర్మన్‌గా నెట్టెం రఘురాం  విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవరం పిఎసిఎస్ అధ్యక్షుడు అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, పోచంపల్లి PACS అధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కృష్ణ ఫార్మసీ సొసైటీ అధ్యక్షుడు యానాల గోపీచంద్, మంగోలు PACS అధ్యక్షుడు బొల్లం పురుషోత్తం, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, జగ్గయ్యపేట మండల డ్వాక్రా సమైక్య అధ్యక్షులు నాయిని రజిని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇస్లావత్ శీను నాయక్ మహిళా సంఘాల సభ్యులు లబ్ధిదారులు కేడీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *