అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ప్రాణంతో సమానంగా కాపాడుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ లేబర్ బి.అనితా వాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటపాలెంలోని చిగురు ఆశ్రమంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ – ఏడీసీ ఈఎస్ఎంయూ విభాగం ఆధ్వర్యంలో అనాధ బాలలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలలకు పండ్లు, పండ్ల రసాలు ఎల్ అండ్ టీ ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఎంయూ విభాగం ప్రతినిధులు బాల, బాలికలతో చిగురు ఆశ్రమంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా చిన్నారులకు గుర్తింపు కాయిన్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలోని చిన్నారులు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా మొక్కలను సంరంక్షించుకునేలా ప్రతినబూని వాటి నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, గ్రీవెన్స్ ఆఫీసర్ జి.వెంకటేష్, ఏపీసీఆర్డీఏ ఈఎస్ఎంయూ బృందం, ఎల్ అండ్ టీ ఈహెచ్ఎస్ మేనేజర్ నీలాంచల్, అర్జున్‌కుమార్, ఎంవీపీ అసిస్టెట్ మేనేజర్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News