విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మేజర్ అవుట్‌ఫాల్ డ్రైన్లలో గుర్రపుడెక్కల తొలగింపు పనులను విస్తృతంగా చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్‌లోని కండ్రిక జంక్షన్ వద్ద ఉన్న మేజర్ అవుట్‌ఫాల్ డ్రైన్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్కలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో తొలగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు మరియు చీఫ్ ఇంజనీర్ (ఇన్‌చార్జ్) పి. సత్యకుమారి మార్గదర్శకత్వంలో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన కాలువలు, డ్రైన్లలో గుర్రపుడెక్కలు మరియు ఇతర అడ్డంకులను శరవేగంగా తొలగిస్తున్నామని తెలిపారు.
వర్షాకాలంలో నగరంలో ఎక్కడా నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రతిరోజూ కాలువలను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య, డ్రైనేజీ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.
Prajavartha Online Telugu News