Breaking News

392 కొత్త వైద్యుల పోస్టింగుల కోసం వెబ్ కౌన్సెలింగ్!

-పారదర్శకత చర్యల్లో భాగంగా తొలిసారిగా అమలు
-20వ తేదీలోగా విధుల్లో చేరేలా 12న పోస్టింగు ఉత్తర్వులు
-ఎన్. హెచ్. ఎo.నోటిఫికేషన్ ద్వారా నియామకాలు
-రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. చ్. ఎం.) కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని
ఎన్. హెచ్. ఎoలోనూ
అనుసరిస్తున్నామని చెప్పారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీచేసి, మెరిట్ ప్రతిపాదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపికచేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో ఆరు కేటగిరి పోస్టులకు ఎంపికచేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని నేడొక ప్రకటనలో మంత్రి శ్రీ సత్యకుమార్ వివరించారు.

6 కేటగిరిల్లో కలిపి 392 పోస్టులు

ఈ 392 పోస్టుల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 173, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఎన్సీడీ క్లినిక్ నిర్వహణ అవసరాల కోసం 99 పోస్టులు కేటాయించారు. నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల అవసరాలకు 70, న్యూట్రిషిన్ రిహాబిలేషన్ సెంటర్ల కోసం 12, టెలీ మెడిసిన్ హబ్స్ అవసరాల కోసం 25, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల కోసం 13 చొప్పున కలిపి 392 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంతకుముందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కౌన్సెలింగ్ జరిగేది. ఈ విధానంలో ఖాళీలు చూపిస్తే అభ్యర్థులు పోస్టింగ్ స్థానాలు ఎంపిక చేసుకునే వారు. ఈ విధానంలో సాంకేతికపరమైన సమస్యలు, స్థానాల ఎంపికలో అభ్యర్థులు కాస్త ఇబ్బందులు పడేవారు ఈ సమస్యలకు వెబ్ కౌన్సెలింగ్ ఫుల్ స్టాప్ పెడుతుంది. 6 కేటగిరిల కింద చూపించిన స్థానాల అన్నింటికీ అభ్యర్థులు అప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు వెబ్ కౌన్సెలింగ్లో ఉంది ఆప్షన్ల నమోదుకు అనుగుణంగా పోస్టింగు స్థానాలు దక్కుతాయి. ఈ విధానంలో మానవ జోక్యం ఉండదు. ఇందుకు అనుగుణంగా జాతీయ ఆరోగ్య మిషన్ ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రారంభమైన ఆప్షన్ల నమోదు గడువు బుధవారంతో ముగియనుంది. పోస్టింగు ఉత్తర్వులు శుక్రవారం లేదా శనివారం అభ్యర్ధులకు ఆటోమేటిగ్గా జారీ జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ జి వీరపాండియన్ వెల్లడించారు. పోస్టింగు ఉత్తర్వులు పొందిన వారు ఈ నె ల 20వ తేదీలోగా విధుల్లో చేరాలని స్పష్టంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *