గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా, అనాలోచితంగా చెట్లను తొలగిస్తే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్య రక్షణలో చెట్లు కీలకంగా ఉంటాయని, కాని కొందరు అనాలోచితంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం చెట్లను తొలగిస్తున్నారన్నారు. ఇంటి ముందు ఉన్న చెట్ల ఆకులు రాలుతున్నాయని, కొమ్మలు ఇంటి మీదకు వాలిపోతున్నాయని, ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి వంటి కారణాలతో చెట్లను తొలగించే వారి పై వాల్టా (వాటర్, లాండ్ అండ్ ట్రీస్ యాక్ట్) 2002 ప్రకారం నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెట్ల వలన ప్రమాదబరితమైన లేదా ఇబ్బందికర పరిస్తితులు ఉంటే ముందస్తుగా నగరపాలక సంస్థకు అర్జీ దాఖలు చేయాలని, సంబందిత అధికారులు పరిశీలించి, వాస్తవంగా ఇబ్బందిగాకరంగా ఉంటే తొలగించుటకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కనుక పర్యావరణ పరిరక్షనకు ప్రతి ఒక్కలు మొక్కలు నాటి సంరక్షించాలని, అలాగే ఉన్న చెట్లను కూడా కాపాడుకోవాలని కోరారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …