విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన రోజే ఆయనకు ఘనమైన నివాళులర్పించిన వారమవుతామని డిటిసి అన్నారు. స్థానిక బందరురోడ్డు లోని డిటిసి కార్యాలయంలో మంగళవారంనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్దంతి పురస్కరించుకుని ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యాలయం ప్రాంగణంలో బి.ఆర్ అంబేద్కర్ కాంక్ష విగ్రహానికి డిటిసి ఎం పురేంద్ర పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధంగా మనకు లేకపోయినా ప్రపంచంలో మానవాళి ఉన్నంతవరకు ఆయన బ్రతికే ఉంటారని, ఈనాడు మనం పొందుతున్న హక్కులు రాజ్యాంగ ద్వారా మనకు సంక్రమించాయని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఆయన గుర్తు చేశారని డీటీసీ తెలిపారు. హక్కులను పొందడమే కాకుండా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉద్యోగులుగా మనం ప్రజలకు సేవలందించే అవకాశం కలిగిందని, కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని గౌరవించెవిధంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి సేవాలందించాలన్నారు. ప్రతిఒక్కరు బాధ్యతయుతంగా పనిచేసి సేవలందించినప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చినవారవుతామని డీటీసీ పురేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో జగదీశ్వర్ రాజు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరి, జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, కార్యదర్శి కెవివిఎన్ మురళి, రవాణాశాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్ ప్రవీణ్, జి నాగమురళి, సంఘం పూర్వపు ఆధ్యక్షులు జె రాజారావు, డా,, బీఆర్ అంబెడ్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News