రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బడిబాట పడతాం .. బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం అనే నినాదంతో జిల్లా ను బాల్య వివాహాలు లేని జిల్లాగా రూపుదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం ఆనం కళా కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన పై గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా ను బాల్య వివాహాలు లేని జిల్లాగా రూపు దిద్దేందుకు తల్లితండ్రుల్లో మరింతగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను తీర్చి దిద్దేందుకు వాళ్ళు బడికి వెళ్ళే విధంగా అడుగులు వెయ్యాలని కోరారు. బాల్య వివాహం నిషేధ చట్టం 2006 ప్రకారం 18 ఏళ్ల లోపు ఆడపిల్లలకు 21 ఏళ్ల లోపు పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. బాలవాహాలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించిన వారికి రెండు సంవత్సరాల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూను విధించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఆపద సమయంలో సంప్రదించవలసిన బాలల రక్షణ జవాబుదారులు అంగన్ వాడీ టీచర్, పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామ సర్పంచ్, .రెవెన్యూ అధికారులు , సచివాలయంలో మహిళా పోలీస్ ను, 100 , 1098 నంబర్ల ను సంప్రదించవొచ్చు అని పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా లో బాల్య వివాహాల నిలుపుదల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 18001254156ను జిల్లా కలెక్టర్ కొత్తగా ఆవిష్కరణ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బడి ఈడు పిల్లలు తప్పని సరిగా స్కూల్ కు వెళ్లేలా ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. విజయకుమారి, డి ఈ వో ఎస్. అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News