అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం ఫత్తుల్లాబాద్ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది… 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల పెన్షన్ ను మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …