విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం) ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం ) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల కు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. కావున ప్రజలందరూ తమ తమ ఫిర్యాదులను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విన్నవించుకోవాల్సిందిగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …