-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ వేడుకైనా వ్యర్ధాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, క్రీస్తు రాజు పురం, ఎన్టీఆర్ కాలనీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఏ వేడుకైనా సరే సంబంధిత ప్రాంతం లో గల శానిటరీ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి చెత్త బుట్టలో వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించాలని ప్రజారోగ్య శాఖధిపతి డాక్టర్ కె. అర్జునరావు ను ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంట్లో లేదా కళ్యాణమండపంలో కానీ వేడుకలు నిర్వహించుకున్నప్పుడు రోడ్డుమీద వ్యర్ధాలను పారివేయకుండా, వ్యర్ధాల సక్రమంగా నిర్వహించాలని, పాటించని పక్షంలో జరిమానకు అర్హులని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తదుపరి కృష్ణలంక ఏపీఎస్ఆర్ స్కూల్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. అన్న క్యాంటీన్ లో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే పూర్తి చేయాలని, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, అన్న క్యాంటీన్ కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారుల దేనని కమిషనర్ అన్నారు.
Prajavartha Online Telugu News