విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తొలివిడతలో ఎంపిక చేసిన 1153 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు క్రింద చేపట్టిన పనులన్నీ జూలై నెలాఖరు నాటికి పూర్తి కావాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) లో తోటి శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నాడు-నేడు పనులపై జెసి యల్. శివశంకర్ విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడత 1153 పాఠశాలల్లో రూ. 226 కోట్లతో చేపట్టిన పనులను సంపూర్ణ స్థాయిలో పూర్తి చేసి విద్యార్ధులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేసి ఉన్నందున జూలై నెలాఖరు లోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాల పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు. నాడు-నేడు పనులన్నీ యధావిధిగా కొనసాగించి షెడ్యూలు ప్రకారం పనులు పూర్తి కావాలన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …