Breaking News

All News

ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈ ఎస్ ఎం ఎస్) యాప్ పై నోడల్ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలి…

–నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి : జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నోడల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారo స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు సార్వత్రిక ఎన్నికలు -2024 సన్నద్ధత పై నోడల్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం …

Read More »

సబ్ కలెక్టర్ విడిది గృహాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ప్రారంభించడం జరిగింది. స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ మాధవీలత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లడుతూ, ఇకపై ప్రజలకి అందుబాటులో …

Read More »

సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల ఖరీదైన కంటి శస్త్ర చికిత్స పరికరం

-అప్తాలీక్ పరికరాన్ని అందచేసిన డెక్కన్ కెమికల్స్ ప్రవేట్ లిమిటెడ్ ఎండి జి. మనోహర్ -కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. -కలెక్టర్ మాధవీలత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.20 లక్షలు ఖరీదు చేసే కంటి పరిక్ష మరియు శస్త్ర చికిత్స పరికరములు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సామజిక ఆరోగ్య …

Read More »

రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

-అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి -ఉపాధి హామీ పనులు, కార్మికులు పని గంటలు రీ షెడ్యుల్ చెయ్యాలి -మ.12 నుంచి మ.3 గంటల వరకు బయట తిరగవద్దు -ఎన్నికల నేపథ్యంలో చలివేంద్రాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -జంతువులకు, పక్షులకు నీటి కుండీలను ఏర్పాటు చెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలం దృష్ట్యా ఇప్పటికే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉందని, అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను జాగృతి చెయ్యడం అత్యంత …

Read More »

ప్రజలు రూ.50 వేల మించి నగదు వెంట తీసుకుని వెళ్ళేరాదు

-అటువంటి సందర్భాల్లో తగిన ఆధారాలు వెంట ఉంచుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి -జిల్లాలో ఇప్పటి వరకు 13 మంది నుంచీ 23.44 లక్షలు సీజ్ చేసి, రూ.21.44 విడుదల చెయ్యడం జరిగింది -పోస్టల్ బ్యాలెట్ పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నియమావళి అమలు సమయంలో రూ.50 వేలకు మించి నగదు రూపంలో వెంట తీసుకుని వెళ్లరాదని , ఆయా సందర్భాల్లో ఖచ్చితంగా తగిన ఆధారాలను తనిఖీ …

Read More »

స్టేక్ హోల్డర్స్ కు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు వారి ఆదేశాను సారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాదికార సంస్థ నందు “మోటార్ వాహనాల సవరణల చట్టం మరియు మోటార్ వాహనాల సవరణ నిబంధనలు, 2022” పై స్టేక్ హోల్డర్స్ కు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 5 వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. విజయ్ గౌతమ్ ఈ సదస్సులో మోటార్ వాహనాల సవరణల చట్టంలోని పలు సెక్షన్ల పై అవగాహన కల్పించారు. ఈ సవరణలకు …

Read More »

4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం……

-9వవార్డులో విస్తృతంగా పర్యటిస్తు…. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -మంగళ హారతులు… పూల వర్షం కురిపిస్తూ…. వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానికు స్వాగతం పలికిన ప్రజానీకం -గుడివాడ అభివృద్ధిని అడ్డుకునేలా టిడిపి నేతలు కోర్టులకు వెళ్లారు…. -ఐదేళ్లుగా మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలి… గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరుకుంది . పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని …

Read More »

ప్రజల జయ జయ ద్వానాల మధ్య….. నాలుగో రోజు దిగ్విజయంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-ఎనిమిదవ వార్డులో నిర్వహించిన ఎమ్మెల్యే నాని ప్రచారంలో భారీగా పాల్గొన్న ప్రజానీకం…. -గజ మాలలు…. మంగళ హారతులు…. పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే నానీకు బ్రహ్మరథం పట్టిన ప్రజానికం -గుడివాడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదవ సారి కూడా విజయం సాధిస్తానన్న ఎమ్మెల్యే నాని…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని నాలుగవ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది . శనివారం సాయంత్రం 8వ వార్డులో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల …

Read More »

పాలిటెక్నిక్ విధ్యార్దిని బలవన్మరణపై విచారణ

-ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు -24 గంటలలో వివరణాత్మక నివేదికకు ఆదేశించిన కమీషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ జిల్లా కొమ్మాది చైతన్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని బలవన్మణంపై సాంకేతిక విద్యా శాఖ విచారణకు అదేశించింది. సంఘటన పూర్వాపరాలపై పూర్తిస్దాయి విచారణ జరిపి 24 గంటలలోపు వివరణాత్మక నివేదిక అందించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఉత్తర్వులు జారీ చేసారు. వివిధ దినపత్రికలలో శుక్రవారం వచ్చిన వార్తా కథనాలను పరిశీలించిన మీదట వాస్తవాలను …

Read More »

తెలుగు జాతి కీర్తిపతాక పీవీ నరసింహారావు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా పీవీ నరసింహారావు సేవలకుగానూ అందుకోవడం తెలుగుజాతికి, బ్రాహ్మణ్యానికి గర్వకారణమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ సమగ్రాభివృద్ధికి పీవీ అందించిన సేవలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు స్మరించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టిన …

Read More »