Breaking News

All News

పదో తరగతి గణితం పరీక్షకు 95.51 శాతం విద్యార్థులు హాజరు

-ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా నాలుగో రోజు గణితం పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,81,256 మంది విద్యార్థులకు గానూ 6,50,668 (95.51% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 30,588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1486 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, …

Read More »

ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిందే…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రచారాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు, ఔట్సొర్సింగ్ ఉద్యోగులు ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం రాజకీయ నాయకుల సమావేశాలకు హాజరైన 12 మంది వాలంటీర్లను, ప్రజాప్రతినిధులతో ప్రచారాల్లో ఉన్న ఇద్దరు ఔట్సొర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ కమీషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ …

Read More »

25,26 తేదీల్లో (సోమ,మంగళవారాలు) నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ద ప్రాతిపదికన మరమత్తు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ సంగం జాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే 685 ఎం.ఎం. డయా సిఐ పంపింగ్ మెయిన్ లైన్ పై లీకు ఏర్పడి …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో వున్న మహిళలు (గర్భవతులు, బాలింతలు) ఎక్కువ సంఖ్యలో సౌఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు కల్పించవలసిన ఏర్పాట్ల గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరపున  చైర్-పర్సన్  గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి చేశారు. 1) అన్ని పోలింగ్ బూత్ ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. 2) చిన్న పిల్లలతో వచ్చే బాలింతలకు పోలింగ్ బూత్ వద్ద …

Read More »

జూన్ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోండి

-115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు -అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి -సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి -కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి -బోర్ వెల్స్ ఇతర మంచినీటి పధకాలకు మరమ్మత్తులుంటే వెంటనే నిర్వహించండి -నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలి -నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పధకాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవండి -1904 కాల్ సెంటర్ ద్వారా తాగునీటి …

Read More »

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది… : భువనేశ్వరి

బద్వేల్, పోరుమామిళ్ల, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్లలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి గురువారం పరామర్శించారు. పరామర్శల అనంతరం పోరుమామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై …

Read More »

నూజివీడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు..

-ఎస్ ఎన్ రాజా., (అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్) ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎవరికీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించలేదని, ఎవ్వరికీ హామీ కూడా ఇవ్వలేదని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి(అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్) ఎస్ ఎన్ రాజా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూజివీడుతో పాటు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని, ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల …

Read More »

అప్పు పెట్టడంలో మొదటి స్థానం… ఆత్మ గౌరవంలో ఆఖరి స్థానం…

-ఇదీ రాష్ట్ర దుస్థితి… : వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం ఆంధ‌్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అప్పు పెట్టడంలో మొదటి స్థానం… ఆత్మ గౌరవంలో ఆఖరి స్థానం అన్నట్లు ఉందని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో గురువారం ఇండియా భాగస్వామ్య, రైతు, కార్మిక, మహిళ, ప్రజా సంఘాల రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు …

Read More »

కాపు సమస్యలపై వై.యస్. షర్మిలకు వినతి పత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, గవర్నరుపేట, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లోని కాంగ్రెస్ ఆఫీసులో గురువారం ఎపిసిసి అధ్యక్షురాలు వై. యస్. షర్మిలని కలిసి, కాపు సమస్యలను వివరించి తమ మ్యానిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరచాలని కోరారు. దామాషా ప్రకారం కోస్తా జిల్లా, రాయలసీమ జిల్లా, ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గానికి కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు తగినస్థానం కల్పించాలి. అదే విధంగా తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లో కాపుసామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ 5% నుండి 10% పెంచి …

Read More »

ఘనంగా బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విధ్యాధరపురం, ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డులో గల అగర్వాల్‌ కళ్యాణ మండపం నందు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్‌ ఆధ్వర్యంలో గురువారం బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయజనతాపార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్‌ బాజి మాట్లాడుతూ దేశం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చెయ్యాలనే తపనతో ప్రధాన మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని …

Read More »