Breaking News

Andhra Pradesh

శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మెషేన్ రాజు ఏకగ్రీవ ఎన్నిక

-శాసనమండలి ఛైర్మన్ గా ప్రకటించిన విఠపు బాలసుబ్రహ్మణ్యం. -అభినందించిన ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయిందన్నారు. శాసన పరిషత్ 9వ నియమం ప్రకారం మండలి ఛైర్మన్ నామ నిర్ధేశం జరిగిందన్నారు. కొయ్యే మోషేన్ రాజు అభ్యర్థితత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ …

Read More »

చేనేతల స్వావలంబనకు ప్రత్యేక కృషి

-చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి నాగరాణి -ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లితో మర్యాద పూర్వక భేటీ, అధికారులకు దిశా నిర్ధేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు చేనేత కార్మికుల స్వావలంబనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి తెలిపారు. చేనేతల ప్రయోజనం కోసం ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని క్షేత్ర స్ధాయికి తీసుకువెళ్లేందుకు స్పష్టమైన …

Read More »

జగనన్న స్వచ్చసంకల్పం క్లాప్ కృష్ణా పారిశుధ్య సేవలను పటిష్టవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి…

-గార్బేజ్ సేకరణ అనంతరం క్లాప్ మిత్ర సిబ్బంది రోజువారీ కార్యక్రమం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి.. -పంచాయితీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిని నియంమించిన బృందాలు పర్యవేక్షింటాయి.. -జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చసంకల్పంలో భాగంగా జిల్లాలో మెరుగైన పారిశుధ్య సేవలను పటిష్టవంతంగా అమలు చేస్తూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) క్యాంపు కార్యాలయంలో శుక్రవారం …

Read More »

రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు : జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరిక

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంపై లబ్ధిదారుల నుండి మంది స్పందన: మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ-క్రాప్ లో రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను హెచ్చరించారు. వ్యవసాయం, జగనన్న గృహ హక్కు పధకం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, జగనన్న పాలవెల్లువ, మండల ప్రత్యేక అధికారుల పనితీరు, తదితర కార్యక్రమాలపై స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని తహసీల్దార్లు, …

Read More »

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం …

Read More »

జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవం …

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవ్వగలరని, ప్రతి గృహిణి కూడా పిల్లల్ని తప్పనిసరిగా గ్రంధాలయాలను పంపించాలని మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు కి చెందిన మహిళా ప్రతినిధులు, తమ తమ రంగాల్లో విశిష్ట చాటుతున్న మహిళలను లైబ్రరీయన్ త్రినాధ్ సన్మానించారు. …

Read More »

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం…

-1.1.2022 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు కూడా దరఖాస్తు చేసుకోగలరు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల …

Read More »

అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి… : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటన లో ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వర్షాల నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో 1800-233-1077,సబ్ కలెక్టర్ నరసాపురం లో 8688113733, ఆర్ డి ఓ జంగారెడ్డిగూడెం లో 9640170352 , ఆర్డీఓ కొవ్వూరు కార్యాలయంలో లో …

Read More »

బాబును జీవితంలో ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వరు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-చంద్రబాబు డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగంపై, రాష్ట్ర రైతాంగంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో శాసనసభ వేదికగా మరోసారి బయటపడిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యతపై ఆ శాఖ మంత్రి సుదీర్ఘంగా వివరిస్తున్న తరుణంలో పదేపదే తెలుగుదేశం సభ్యులు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. రైతాంగానికి మేలు చేకూర్చే అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని  ముఖ్యమంత్రి అడిగినప్పటికీ.. రాజకీయంగా ప్రభుత్వంపై …

Read More »

పోరాడితే ఎంతటి నిరంకుశ ప్రభుత్వమైనా దిగిరావలసిందే అని రైతంగపోరాటం నిరూపించింది… : వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోరాడితే ఎంతటి నిరంకుశ ప్రభుత్వమైనా దిగిరావలసిందే అని రైతంగపోరాటం నిరూపించిందనీ, ఢిల్లీ మోడీ కంచుకోటనే కుదిపిన ప్రజాపోరాటాలకు గల్లీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను కుదపి కుదేలు చేయడం పెద్ద సమస్య కాదని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో కేంద్ర బిజెపి మోడి ప్రభుత్వం రైతు చట్టాలు రద్దు చేస్తామని ప్రకటించడం హర్షించ దగ్గ పరిణామమని, ప్రజా పోరాటాలవలనే ఈ విజయం సాధించడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర …

Read More »