Breaking News

Daily Archives: May 8, 2024

విజయవాడ నగర వీధుల్లో ఎన్డీఏ అగ్ర నేతల విహారం

-ప్రధాని మోదీ తో కలసి పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రోడ్ షో -బ్రహ్మరథం పట్టిన బెజవాడ జనం -మోదీ చిత్రపటాలతో మహిళల పాదయాత్ర -బందరు రోడ్డుని ముంచెత్తిన మూడు పార్టీల జెండాలు, అభిమానులు -కూటమి షో సూపర్ సక్సెస్ తో మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధులు ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పవన్ కళ్యాణ్, …

Read More »

ఎన్నికలకు సంబంధించిన విజ్ఞాపనలు ఫిర్యాదులు చేయవచ్చు

-సాధారణ పరిశీలకులు నరహర సింగ్ బంగర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏవైనా విజ్ఞాపనలు ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయా నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నరహర సింగ్ బంగర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. తాను గన్నవరం కేసరపల్లిలో ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల అతిధి గృహంలో బస చేస్తున్నట్లు, విషయ తీవ్రతను బట్టి సెల్ నెంబర్ 871 2693654 సంప్రదించవచ్చని తెలిపారు.

Read More »

వైయస్సార్ సిపి ఇంటి ఇంటికి ప్రచారం…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ ఎనిమిదవ వార్డు బూత్ నెంబర్ 247 మరియు 250 నందు వైయస్సార్ సిపి ఇంటి ఇంటికి ప్రచారంలో భాగంగా  బుధవారం వివేకానంద నగర్ శ్రీనివాస కాలేజ్ అపార్ట్మెంట్స్ నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు గురించి సంక్షేమ పథకాలు గురించి పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి జోగి రమేష్ మచిలీపట్నం అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ లు ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రతి ఇంటి ఇంటికి …

Read More »

సంక్షేమ పథకాలను కొనసాగించడానికి వైసీపీ కి అండగా నిలబడండి… : జోగి రమేష్

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ బుధవారం కంకిపాడు మండల పరిధిలోని కందలంపాడు, జగన్నా ధపురం, కోమటిగుంటలాకులు, క్రిస్టియన్ పేట గ్రామాలలో ఎన్నికల  ప్రచార కార్యక్రమాన్నినిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓట్లను వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ 14 సం వత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు తను అధి కారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయ …

Read More »

గాంధీ నాగరాజన్‌ ఓటర్ల అవగాహన ప్రచారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి ఓటువేసి గెలిపించాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పలు కూడలి ప్రాంతాలలో తన ప్రచార రథంతో ఓటర్ల అవగాహన ప్రచారం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ వారి వారి స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవలు అందించేందుకు కృషి చేసేవారినే ఎన్నుకోవాలని గాంధీనాగరాజన్ ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు …

Read More »

ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి ఇంటి కి వెళ్లి కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. బుధవారం ప్రత్తిపాటి అరుణకుమారి గన్నవరం నియోజకవర్గంలోని ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ తాను పోటీచేస్తున్న ‘ఆపిల్‌’ గుర్తుకి ఓటువేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి మౌళిక సదుపాయాల రూపకల్పనలో మరింత ముందుకు వెళతానన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడటానికి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటానన్నారు. ఒక …

Read More »

ఐదో విడతలో పోటీ పడనున్న 695 మంది అభ్యర్థులు

-6 రాష్ట్రాలు, 2 కేంద్ర పరిపాలిత ప్రాంతంలోని 49 పీసీ స్థానాల్లో జరగనున్న ఎన్నికలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సాధారణ ఎన్నికలు – ఐదవ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతములోని మొత్తం 49 లోక్ సభ స్థానాలకు మొత్తం 695 అభ్యర్థులు పోటీ పడనున్నారు. సగటున ఒక్కో పార్లమెంటరీ స్థానానికి 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరియు జమ్మూ&కాశ్మీర్, లడఖ్ కేంద్ర పరిపాలిత …

Read More »

4వ ద‌శ ఎన్నిక‌ల‌పై సీఈసీ రాజీవ్‌కుమార్ దిశానిర్దేశం

– జిల్లా క‌లెక్ట‌రేట్ నుంచి వర్చువ‌ల్‌గా హాజ‌రైన -సాధార‌ణ ప‌రిశీల‌కులు మంజూ రాజ్‌పాల్, న‌రీంద‌ర్‌సింగ్ బాలి, -వ్య‌య ప‌రిశీల‌కులు వి.జ‌స్టిన్‌, సౌర‌భ్ శ‌ర్మ‌, మ‌ధ‌న్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేదీన వివిధ రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో 4వ ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై న్యూఢిల్లీ నిర్వాచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ 4వ ద‌శ …

Read More »

నేరుగా విజ్ఞాప‌నలు, ఫిర్యాదులకు అవ‌కాశం

– ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కుల‌ను అతిథిగృహాల్లో నిర్దిష్ట స‌మ‌యాల్లో క‌లిసేందుకు వీలు – ఫోన్ ద్వారా కూడా సంప్ర‌దించొచ్చు – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీ-విజిల్ త‌దిత‌ర మార్గాల ద్వారా ఫిర్యాదులు స్వీక‌రించి, ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌ని.. అదే విధంగా జిల్లా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కుల‌ను నిర్దిష్ట స‌మ‌యాల్లో నేరుగా క‌లిసి ఆయా అంశాల‌కు సంబంధించి విజ్ఞాప‌నలు, ఫిర్యాదులు అందించ‌వ‌చ్చ‌ని, అదే విధంగా విష‌య తీవ్ర‌త‌నుబ‌ట్టి ఫోన్ నంబ‌ర్ల‌లోనూ సంప్ర‌దించొచ్చ‌ని జిల్లా …

Read More »

1,128 సీ-విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సీ-విజిల్ ద్వారా 1,131 ఫిర్యాదులురాగా 1,128 ఫిర్యాదుల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని.. మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ) త‌దిత‌ర మార్గాల ద్వారా మొత్తం 2,867 ఫిర్యాదులు రాగా 2,782 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని వివ‌రించారు. …

Read More »