Breaking News

Monthly Archives: May 2024

పాఠశాల దశ నుండి కెరీర్ విద్య, జీవన నైపుణ్యాలను బోధించాలి

-ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ IAS.,  -కెరీర్ గైడెన్స్ అమలు తీరుపై సమీక్షించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు పాఠశాల దశ నుండి కెరీర్ విద్యతో పాటు జీవన నైపుణ్యాలు బోధించాలని ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ శ్రీ సౌరభ్ గౌర్ IAS., గారు అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మెల్ బోర్న్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) వారి సహకారంతో పైలట్ కెరీర్ విద్య కార్యక్రమ అమలు పై సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

డిఈఈ సెట్2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించిన  డిఈఈ సెట్2024  ప్రవేశ పరీక్షా ఫలితాలు   విడుదలయ్యాయి. డిఈఈ సెట్2024  కన్వీనర్  మరియు జాయింట్ డైరెక్టర్  డాక్టర్  మేరీ చంద్రిక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో డిఈఈ సెట్2024 ప్రవేశ పరీక్ష ఫలితాలనువిడుదల చేశారు. ఈ పరీక్షకు 4949మంది అభ్యర్థులు హాజరు కాగా 3191 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థి బులుసు గ్రీష్మిత (హాల్ టికెట్ నెంబర్ 24057013 …

Read More »

ఏపీ ఈసెట్ ఫ‌లితాల విడుద‌ల‌

– ఫ‌లితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు – మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో ఈసెట్ ప‌రీక్ష‌ – పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. గురువారం ఉద‌యం అనంత‌పురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ కే. హేమ‌చంద్ర‌రెడ్డి, ఈసెట్ ఛైర్మ‌న్ శ్రీనివాస‌రావు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈసెట్ ఫ‌లితాల్లో 90.41 శాతం మంది ఉత్తీర్ణులైన‌ట్లు అధికారులు తెలిపారు. …

Read More »

15 రోజుల అనంతరం రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్,భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయాని కి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటన కు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు.

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పర్యటన

-ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్ల‌పై రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తిస్థాయిలో సంతృప్తి -భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీ లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాల‌ను, ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా -ఓట్ల లెక్కింపు చేపట్టిన చర్యలను వివరించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ -భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను వివ‌రించిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల …

Read More »

కౌంటింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి ..

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం కృష్ణా యూనివర్సిటీలోని మీడియా సెంటర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

కృష్ణా జిల్లా లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వారు తొలుత జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మలతో కలిసి విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ భవనంలోని మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు శాసనసభ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు …

Read More »

జంతువుల అక్రమ రవాణా నియంత్రపై రాష్ట్ర,జిల్లా స్థాయిలో నోడలు అధికారుల నియామకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ నెలలో రానున్నపవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా మరియు జంతు వధ నియంత్రణకు రాష్ట్ర,జిల్లా స్థాయిలో నోడలు అధికారులను నియమిస్తూ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.అక్రమ జంతు రవాణా మరియు జంతువధల నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో డిజిపి కార్యాలయంలో యం.రవీంద్రనాధ్ బాబు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్(శాంతి భద్రతలు)నోడలు అధికారిగా నియమించారు.అలాగే జిల్లా స్థాయి నోడలు అధికారులుగా అదనపు ఎస్పి లేదా డిఎస్పి స్థాయిలో …

Read More »

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలు (2024)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు యోగ శక్తి సాధన సమితి,విజయవాడ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ సంవత్సరం ‘అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స’ అనే అంశంపై ప్రజల్లో అవగాహన,వారే తగ్గించుకునే లాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయునున్నట్లు తెలిపారు.చివరి రోజు జూన్ …

Read More »

గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్ల‌లో పూర్తి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

– నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు – జిల్లాస్థాయి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో విస్తృత త‌నిఖీలు – నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో మాక్‌డ్రిల్స్ నిర్వ‌హ‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలో విజ‌య‌వాడ‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని గేమింగ్ జోన్స్‌, ఎగ్జిబిష‌న్లు త‌దిత‌రాలు అగ్ని ప్ర‌మాదాలు వంటి విప‌త్తులు సంభ‌వించ‌కుండా నిబంధ‌న‌ల మేర‌కు పూర్తిస్థాయిలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందేన‌ని.. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు హెచ్చ‌రించారు. గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ …

Read More »