Breaking News

Daily Archives: June 10, 2024

టీచర్ల బదిలీల పేరుతో కోట్లు దోచుకున్న బొత్స

-సహకరించిన అధికారులు, కమిషనరేట్ కీలక అధికారి -బదిలీల్లో అవకతవకలపై విచారించి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ -ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీచర్ల బదిలీలలో అవినీతి అక్రమాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ నేతలు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బదిలీ పేరుతో కోట్లు దండుకున్న మాజీ మంత్రి బొత్స, ఆయన పీఏ, సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య మాట్లాడుతూ…గత నెల 13న జరిగిన …

Read More »

రేపు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ సంవత్సరం (11-06-2024) మంగళవారం గంగమ్మ తల్లి పండగ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మ కు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. రేపు ఉదయం 4 గంటల నుంచి గంగమ్మ తల్లి కి పూజలు 8 గంటలవరకు జరుగును. అనంతరం …

Read More »

“రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు – సమగ్రాభివృద్దిపై” విస్తృత స్థాయి సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 41 శాతం భూభాగం ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో 41 శాతం నిధులు కల్పంచడంతో పాటు, రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో మరో 20 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 8 వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సిద్దేశ్వరం సమీపంలోని సంగమేశ్వరం …

Read More »

సి ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలిపిన ఏపి జెఎసి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సి ఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ కి ఏపి జెఎసి పక్షాన ఛైర్మన్, సెక్రటరీ జనరల్ కె.వి. శివారెడ్డి, జి.హృదయ రాజు ఆధ్వర్యంలో విజయవాడ సి.యస్ క్యాంప్ కార్యాలయంలో కలసి అభినందనలు తెల్పడం జరిగిందని తెల్పారు. ఈ సందర్భంగా ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు అందని విషయం, బకాయిలు చెల్లించాలని మరియు అనేక సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపి జెఏసి నాయకులు సి …

Read More »

ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌త్యేక బ‌స్సులు

-జ‌న‌సేన శ్రేణులు అందరూ 8374104701 ఫొన్ నెంబర్ కు సంప్ర‌దించాలి అని తెలిపిన జ‌న‌సేన నాయ‌కులు, ప్ర‌ముఖ వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్‌ శ్రీ‌కాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తిలో ఈ నెల 12న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు జ‌న‌సేన పార్టీకి చెందిన మ‌రో 20 మంది ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకార మహోత్స‌వానికి హాజ‌రయ్యేందుకు జ‌నసేన పార్టీ శ్రేణుల కోసం ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న‌ట్టు జ‌న‌సేన నాయ‌కులు, ప్ర‌ముఖ వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. న‌గ‌రంలోని …

Read More »

SC/ST ఉద్యోగార్ధులకు కోచింగ్/ట్రైనింగ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం వద్ద గల నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ SC/ST, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SC/ST ఉద్యోగార్ధులకు కోచింగ్/ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర రెక్రూటింగ్ ఏజెన్సీలు చేపట్టే గ్రూప్ సి మరియు తత్సమాన పోస్టుల కోసం నిర్వహించే వివిధ పరీక్షలలో పోటీపడే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కోచింగ్ పథకం కింద పన్నెండు నెలల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం …

Read More »

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు 11వ తేదీ సాయంత్రంలోగా పూర్తి కావాలి

-ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలి -రాష్ట్ర సమన్వయాధికారి ప్రద్యుమ్న గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు 11వ తేదీ సాయంత్రం లోగా పూర్తి కావాలని రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ రాష్ట్ర సమన్వయ అధికారి పిఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సోమవారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్కు మేధ టవర్స్ సమీపంలో ముఖ్యమంత్రి ప్రమాణ …

Read More »

ఆంధ్రరత్న భవనంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆంధ్రరత్న భవనంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతికి ఘననివాళులర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన దుగ్గిరాల వర్ధంతికి ఎపిసిసి ఉపాధ్యక్షులు వి. గురునాధం ముఖ్యఅతిధిగా విచ్చేశారు. దుగ్గిరాల కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారని, విదేశాలలో విద్య పూర్తి చేసుకొని గుంటూరు వచ్చి లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారని ఆయన తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు …

Read More »

ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , నాయకులు, కార్యకర్తలు ఇళ్ళు పై జరుగుతున్న హింసాకాండను ప్రజలు గమనిస్తున్నారని అలాగే సాదారణ , ప్రజలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారని మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, సంక్షేమ తో పాటు అభివృద్ధికి వినియోగించుకోవాలే కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్ళ వద్ద అల్లర్లు చేయడానికి కాదని, దారుణమయిన ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని. కృష్ణా …

Read More »

ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ ల లో శిక్షణ పొందుచున్న చివరి ఏడాది విద్యార్ధులకు ప్రముఖ కంపెనీల యందు ఉద్యోగాల కొరకు ప్రాంగణ నియామకాలు

-ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ ఎల్ అర్ అర్ కృష్ణన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆదేశానుసారం, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ, రాజమహేంద్రవరం నందు ఈ నెల 13 తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటిఐ ల లో శిక్షణ పొందుచున్న చివరి ఏడాది విద్యార్ధులకు, జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి మరియు వికాస, ఏపిఎస్ఎన్డీసి, టాటా స్ట్రీవ్ ప్రాజెక్ట్ వారి అద్వర్యం లో ప్రముఖ కంపెనీల యందు ఉద్యోగాల కొరకు ప్రాంగణ …

Read More »