Breaking News

Daily Archives: June 19, 2024

ప్రైవేట్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించండి

-మంత్రి కొల్లు రవీంద్రని కోరిన మచిలీపట్నం మీడియా మిత్రులు -గత టీడీపీ హయాంలో 100% ఫీజు రాయితీ ఇచ్చారని గుర్తు చేసిన జర్నలిస్టులు -గత ప్రభుత్వంలో ఫీజు రాయితీ ఉత్తర్వులను నిలిపివేశారని వాపోయిన జర్నలిస్టులు -100% ఫీజు రాయితీపై సానుకూలంగా స్పందించిన మంత్రి రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా ప్రైవేట్ స్కూల్స్ లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం రాష్ట్ర గనులు …

Read More »

లెప్రసీ వ్యాధి నిర్ధారణపై అవగాహనా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఈపీ) కింద ఈ వ్యాధి నిర్ధారణపై అవగాహనకు (ఎల్‌సిడిసి) సంబంధించిన వర్క్‌షాప్ బుధవారం విజయవాడ ఆలివ్ ట్రీ హోటల్‌లో జరిగింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్. కె. పద్మావతి అధ్యక్షత వహించిన ఈ వర్క్‌షాప్‌నకు మొత్తం 26 జిల్లాల నుండి జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టిబి అధికారులు, డిఎన్‌ఎంఓలు/టిబి మెడికల్ ఆఫీసర్లు టిహెచ్ వార్డు మెడికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. లెప్రసీ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ప్రచార కార్యక్రమం …

Read More »

2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన

-గిరిజన ప్రాంత తెగలపై సికిల్ సెల్ ఎనీమియా ప్రభావం.. -గిరిజన జనాభాలో ప్రతి 86 మందిలో ఒకరికి సికిల్ సెల్ ఎనీమియా.. -గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు.. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తి -వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. ఉచితంగా చికిత్స, మందుల పంపిణీ.. -సికిల్ సెల్ ఎనీమియా తీవ్రంగా మారకుండా నిరోధించడం ఉత్తమం.. -కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సికిల్ సెల్ (వ్యాధి) రక్తహీనత (ఎనీమియా) ను 2047 నాటికి నిర్మూలించడమే …

Read More »

హోం మంత్రి అనిత వంగలపూడి ని కలసి శుభాకాంక్షలు తెలియజేసిన బొప్పరాజు మరియు ఏపిజేఏసి అమరావతి నాయకులు

-నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తాం… -బొప్పరాజు మరియు పలిశెట్టి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సచివాలయంలో కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ని ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ కలసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటైన డైనమిక్ క్యాబినెట్లో అనిత వంగలపూడి కి ఎంతో ప్రధానమైన హోమ్ శాఖ బాధ్యతలు తీసుకోవడం అనిత వంగలపూడి  కష్టానికి ఫలితమేనని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి …

Read More »

రేపటి దేశ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం చిన్నారులను బడికి పంపించాలి

-బడి ఈడు పిల్లలను అందరినీ బడిలో చేర్చే బాధ్యత అందరి సమిష్టి బాధ్యత -బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తప్పవు -రేపు నెల జూలై 11 వరకు నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించే సర్వే, పక్కాగా చేపట్టి బడి ఈడు పిల్లలను అందరినీ బడిలో చేర్చాలి: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చూడాల్సిన బాధ్యత …

Read More »

భూసేకరణ అంశాలపై కోర్టులో పెండింగ్ అంశాలపై పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా తప్పకుండా త్వరితగతిన అధికారులు తగు చర్యలు తీసుకోవాలి…

-జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భూసేకరణ అంశాలపై కోర్టులో పెండింగ్ అంశాలపై పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా త్వరితగతిన అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ల్యాండ్ అక్విజిషన్లో కోర్టు కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ అంశాలకు సంబంధించిన కోర్టు కేసులపై సంబంధిత …

Read More »

తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జీవో సంఘం

వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు కమల నాధన్ కమిటీ ద్వారా ఆంద్రప్రదేశ్ కు కేటాయించిన 144 మంది ఉద్యోగులను తిరిగి తమ రాష్ట్రా నికి పంప వలసినదిగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ గత శుక్రవారం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కోరినందున వెంటనే తమ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని టీఎన్జీవో సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రి కార్యదర్శిని బుధవారం అమరావతి లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ని కలిసిన కలెక్టర్ కె. మాధవీ లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత ను కలిసి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి, నిర్వహణ పనుల గురించి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చర్చించడం జరిగింది. బుధవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం లో అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన తరువాత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తొలిసారిగా కలెక్టరు ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ …

Read More »

జూన్ 29న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశబాబు స్ధానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్ లో నిర్వహించే ఈ సమావేశాల్లో ఉమ్మడి …

Read More »

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లమా కోర్సులో స్పాట్ అడ్మిషన్లు.

-ఎస్ పికేయం ఐఐహెచ్ టి ఓఎస్ డి .. ఎస్.గిరిధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్ధులకు గాను ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో గల శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజి నందు మూడు సంవత్సరముల మరియు రెండు సంవత్సరముల (లేటరల్ ఎంట్రీ) హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లమా కోర్సులో స్పాట్ అడ్మిషన్లు ఈనెల 20వ తేదీన (20-06-2024) న నిర్వహించబడునని ఎస్ పి …

Read More »