Breaking News

Daily Archives: June 30, 2024

దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నెలవారీ ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించబడిన ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం నాడు తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన నెలవారీ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ ప్రస్తావన వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో తన చివరి ప్రసంగం చేసిన తర్వాత తాజాగా మరోసారి ‘మన్ కీ బాత్’ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు నేను మీ మధ్యకు, నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను అని …

Read More »

నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభం

– రాష్ట్రంలో మొట్టమొదటి ఆధునిక రిఫరల్ ల్యాబ్ – నిర్దిష్ట కాల వ్యవధిలో, అత్యంత కచ్చితంగా పరీక్షల ఫలితాలు – ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవడం అభినందనీయం – రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నీజెన్ డయాగ్నోస్టిక్స్ ఆదివారం లాంఛనంగా ఆరంభమైంది. ప్రకాశం రోడ్డులోని నీజెన్ డయాగ్నోస్టిక్స్ ను రెయిన్ …

Read More »

పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా జ‌రిగేలా కృషిచేయాలి

– అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జులై 1, సోమ‌వారం ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదివారం డీఆర్‌డీఏ పీడీ, ఎంపీడీవో, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ …

Read More »

జూలై 1వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరణ

-ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి -జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 1వ వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. …

Read More »

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సార‌థికి జాతీయ పుర‌స్కారం

– కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేతుల‌మీదుగా అవార్డు అందుకున్న ఎన్టీఆర్ జిల్లా పూర్వ కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు – ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లాను అత్యున్నత స్థానంలో నిలబెట్టినందుకు దక్కిన గౌరవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బాల‌లే భావి భార‌త సార‌థులు… అలాంటి బాల‌ల హ‌క్కుల సంర‌క్ష‌ణ‌లో గత రెండేళ్లలో విశేష కృషి చేసి ఎన్‌టీఆర్ జిల్లాను అత్యుత్తమ ప్రగతి సాధించిన జిల్లాగా నిలిపినందుకు అప్పటి క‌లెక్ట‌ర్ ఎస్.డిల్లీరావుకు జాతీయ‌స్థాయి పుర‌స్కారం ల‌భించింది. ఆదివారం న్యూఢిల్లీలోని …

Read More »

బడిపిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి… : గాంధీనాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడిపిల్లలకు మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యమైన భోజనం పెట్టాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. ఆదివారం మహాత్మాగాంధీని గాడ్సే హత్యచేసిన రోజుకు నిరసనగా ప్రతి నెలా 30వ తేదీన ఆయన కళ్లకు గంతలతో ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మీడియాతో మాట్లాడుతు గాంధీ, అంబేద్కర్ మార్గాలలో అహింస పాలన, మంచివిధానంకై అడుగులు వెయ్యాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల సహకారంతోనే విజయవంతం …

Read More »

ఇసుక నిలువల నుండి ఇసుక లోడింగ్ మరియు రవాణా చేస్తే అటువంటి వారిపై  చట్ట పరమైన చర్యలు ఉంటాయి.

-తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ మరియు డ్రైవర్లకు -జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం.సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక నిలువల నుండి ఎవరైనా ఇసుక లోడింగ్ మరియు రవాణా చేయుట చట్ట రీత్యా నేరం, ఎవరైనా రవాణా చేసినచో అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం. సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా లోని 7 ఇసుక నిలువల డిపో నందు వర్షా కాలం …

Read More »

వరద నివారణ చర్యలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చివరి సాగు భూమి వరకూ సాగు నీరు అందేలా, వర్షాకాలం దృష్ట్యా వరద నివారణ చర్యలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక , అత్యవసర పనులకు సంబంధించి నిర్వహణా కోసం అవసరమైన నిధుల వివరాలతో నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ కోసం అవసరమైన నిధుల …

Read More »

పింఛన్లు పంపిణీ కోసం 4,092 మంది సిబ్బంది

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ కోసం 4,092 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. ఆదివారం పెన్షన్ పంపిణీ పై అధికారులకి దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, జిల్లా వ్యాప్తంగా 2,44,302 మందికి రూ.165 కోట్ల 13 లక్షల 29 వేల ఐదు వందల ను పంపిణీ చేసేందుకు …

Read More »

జిల్లాలో డయేరియా నియంత్రణ లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి

-జిల్లాలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. -రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామాన్ని సందర్శించి డయేరియా నియంత్రణపై అధికారులు ఆదేశాలు జారీ -ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిరోజు తాగునీటి శాంపిల్స్ పరీక్షలు నిర్వహించాలి. -జిల్లాలో మెరుగైన శానిటేషన్ లక్ష్యంగా పంచాయతీ, పురపాలక సంఘం అధికారులు పనిచేయాలి. -5 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యం  పట్ల తగినంత జాగ్రత్త వహించాలి. -డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవాలి. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »