రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు న్యాయవాదులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు తో “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదుని హెల్మెట్, …
Read More »Daily Archives: July 4, 2024
లాటరి లో జిల్లాకు చెందిన రైతులకు వెండి బహుమతులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ . పి మార్క్ ఫెడ్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా 2023-24 రబీ సీజన్ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన రైతు సంబరాలు ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు లాటరీ పద్ధతిలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కాపవరం కి చెందిన జమ్ము కృష్ణ , నల్లజర్ల మండలం అనంతపల్లి కి చెందిన పేరబత్తుల సతీష్ కి 50 గ్రాముల చొప్పున వెండి అందించారు. ఈ కార్యక్రమం లో భాగంగా …
Read More »దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు
– అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయం -పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : బానిస సంకెళ్లతో ఉన్న భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువుల ప్రసాదించాలనే లక్ష్యంతో, దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న ప్రారంభించిన తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల …
Read More »రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె. వేంకటేశ్వర రావు ఇతర సిబ్బంది బొమ్మూరు జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) అధికారి కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన డ్వామా పీడీ ఏ. ముఖ …
Read More »జిల్లా ఖజానా కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని డి టి వో కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ , ఇతర సిబ్బంది
Read More »కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేత మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కువైట్ అగ్ని ప్రమాదం లో మరణించిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి చేరో ఐదు లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించి భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం స్థానిక గోదావరి బండ్ వద్ద నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కును అందచేశారు. ఈ సంధర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఇటివల కువైట్ దేశంలో జరిగిన అగ్ని …
Read More »ఘనంగా అల్లూరి సీతా రామరాజు 127 వ జయంతి వేడుకలు
– తెగువ పోరాట పటిమ నుంచి స్ఫూర్తి పొందాలి -అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం – పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సదా ప్రాతః స్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గురువారం …
Read More »జిల్లాలో ఉచిత ఇసుక విధానం పటిష్ట అమలుకు కృషిచేయాలి
– ఎనిమిది స్టాక్ పాయింట్లలో 3,69,588 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక – తవ్వకం, రవాణా, లోడింగ్, సీనరేజీ ఫీజు నామమాత్రపు వసూలు – ఈ మొత్తం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లదు – రీచ్ ప్రాంత రహదారులు, ర్యాంపుల వంటి అభివృద్దికి మాత్రమే వినియోగం – డీఎల్ఎస్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక …
Read More »పూర్వ ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో లక్ష్యాలకు అనుగుణంగా సాగాలని.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అత్యంత నాణ్యతతో అందించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సృజన.. గురువారం కలెక్టరేట్లోని ఛాంబర్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు, పథకాలు, సంస్థల ద్వారా స్త్రీ, శిశు సంక్షేమానికి …
Read More »మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహా యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ సృజన… అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన …
Read More »