అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు దాదాపు గంటపాటు కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జస్టీస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును జస్టీస్ ఎన్వీ రమణ ఘన స్వాగతం పలికి సత్కరించారు.
Read More »Daily Archives: July 27, 2024
పర్యాటకం, హాస్పిటలిటీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలి… : తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ తరుణ్ కాకాని విమానాశ్రయంలో కేంద్ర సమాచార మరియు బ్యూరో (MoS) మంత్రి ల్ మురుగన్ కి శాలువ కప్పి స్వాగతం పలికారు. కేంద్ర బడ్జెట్ 2024కి సంబంధించి హయత్ హోటల్లో ప్రెస్‌మీట్ నిర్వహించబడింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పరిశ్రమల సంఘం నేతలతో మాట్లాడారు. ఈ ఇంటరాక్షన్ సందర్భంగా, డాక్టర్ తరుణ్ కాకాని ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ప్రాతినిధ్యం వహించి, పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను మరియు అవసరమైన …
Read More »పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు… : నేతి మహేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు పెట్టె ఓటాన్ బడ్జెట్ ఎన్నికల తరువాత కూడా పెట్టడం అంటే ఆంద్రప్రదేశ్ ఆర్థిక దివాళా తీసినట్లే అని అనుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అద్వర్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద జరిగిన విలేకరుల సమావేశంలో నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ 2019 ఎన్నికల తరువాత మేము పూర్తి స్థాయి బడ్జెట్ …
Read More »సైన్యం లో పని చెయ్యటం అంటే నిజమైన దేశ సేవ… : తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రజత్కార్గిల్దివాస్ 25 సంవత్సరాల విజయ్కార్గిల్దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ కార్గిల్‌లో ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను బలిగొన్న భారత సైన్యానికి చెందిన సైనికులను గుర్తుచేసారు. భారతీయ సైన్యంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ సుబేదార్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, హాజరైన ఇతర అతిథులచే సత్కరించబడ్డారు. సైన్యం లో పని చెయ్యటం అంటే నిజమైన దేశ సేవ అని అన్నారు. నలందా కళాశాల …
Read More »ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు… అర్జీల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలో స్పందించిన పోలీసు యంత్రాంగం… కేసులు నమోదు చేసి బైండోవర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్- తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచీ పరిశీలిస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో కలసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, …
Read More »ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది 03.08.2024
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 20 వ …
Read More »కమిషనర్ కీర్తి చేకూరి సేవలు అభినందనీయం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర కమిషనర్ గా పూర్తి సంతృప్తిగా విధులు నిర్వహించామని, తమ విధి నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేశామని ఏపి ట్రాన్స్‌కో జెఎండిగా బదిలీ అయిన కీర్తి చేకూరి అన్నారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో బదిలీ అయిన కీర్తి చేకూరికి అధికారులు, ప్రజా ప్రతినిధులు వీడ్కోలు, అభినందన సభ నిర్వహించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో కీర్తి చేకూరి మాట్లాడుతూ …
Read More »మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి – సీ.ఐ.డీ ఎస్పీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా ముందుకు రావాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఎ.హెచ్.టి.యు), మహిళా సంరక్షణ విభాగం-సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పిలుపునిచ్చారు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత మానవ అక్రమ రవాణా మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిందని ఆమె అన్నారు. 30 జూలై 2024న జరుపుకోబోతున్న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక …
Read More »2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించేందుకు తీసుకొచ్చిన చారిత్రాత్మక బడ్జెట్
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో మూడోసారి విజయం సాధించడం ఆ కలను సాకారం చేస్తుంది : కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.మురుగన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23న సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024-25 చారిత్రాత్మకమైనదని, భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించే దిశగా రూపుదిద్దుకుందని కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ …
Read More »వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుకుంటాం
-బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత -జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -మంత్రి కందుల దుర్గేష్ పెరవలి / ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన కుటుంబాలకు అండగా నిలిచి, జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ, 529 కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి …
Read More »