-అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వైన్ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ కూటమి ప్రభుత్వం పై ఆరోపణ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి …
Read More »Monthly Archives: December 2024
భోగస్ వ్యక్తులను గాని, సంఘాలను గాని నమ్మి మోసపోవద్దు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఉభయ తెలుగు రాష్ట్రాలు) ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం & డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఉభయ తెలుగు తెలుగు రాష్ట్రాలు) వారు సంయుక్తముగా సమావేశం నిర్వహించారు. శనివారం గాంధీనగర్‌లో ఫిలింఛాంబర్ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్ట గొడుగుల్లాగా రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీల పేర్లతో స్థాపించి వారి స్వలాభాల కోసం అమాయకులైనా మన కార్మికుల వద్ద నుండి కార్డులిస్తామని, ఇళ్ళు ఇప్పిస్తామని రకరకాలుగా …
Read More »నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూ కే చారిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ & డైరెక్టర్ ప్రముఖ వైద్యుల డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. శనివారం సూర్యరావుపేటలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హర్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో 33వ ఉచిత పిల్లల గుండె ఆపరేషన్ల …
Read More »గీత వృత్తిని మరింత ప్రోత్సహిస్తాం
-వీరంకి వెంకట గురుమూర్తి, చైర్మన్, ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు.. బెంజిసర్కిల్ లో ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ హాల్ లో ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి …
Read More »వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
– క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదు – సమష్టి కృషితో మాతా, శిశు మరణాల పూర్తిస్థాయి నియంత్రణపై దృష్టిపెట్టండి – హైరిస్క్ గర్భిణీలకు అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించండి – వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణంకంటే విలువైనది ఏదీ లేదని.. మాతా, శిశు మరణాలు సంభవించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో సమష్టి కృషితో మాతా, శిశు …
Read More »ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా..
– పర్యావరణ పరిరక్షణకూ గొప్ప మేలు – ప్రతిఒక్కరూ పునరుత్పాదక ఇంధనం దిశగా అడుగేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరముందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. రాష్ట్ర ఇంధన శాఖ – ఇంధన పరిరక్షణ మిషన్ (ఎస్ఈసీఎం), జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల (డిసెంబర్ 14 – …
Read More »శిశిరం చిత్రం అతి త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, మూకిరి అనిల్ లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తు, డాక్టర్ రావిపాటి వీరనారాయణ చిత్ర సమర్పకులుగా, వరల్డ్ రికార్డు హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం లోని పాటలు భారత దేశం లోనే ప్రముఖ ఆడియో డిస్టిబ్యూటర్స్ అయిన ఆదిత్య మ్యూజిక్ ద్వారా అతి త్వరలో విడుదల కానున్నాయని దర్శకుడు రత్నాకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »ఘనంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఏర్పాట్లు
-పర్యవేక్షించిన మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన డిసెంబర్ 15 వ తేదీన ఆయన గౌరవార్థం ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణ సక్రమంగా జరగడంలేదని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా పూర్తిగా విఫలమైందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలని కాలయాపన చేస్తున్నారని …
Read More »113 నీటి వినియోగదారుల ప్రాదేశిక నియోజకవర్గాలు ఎన్నిక ఏకగ్రీవం
-డిసెంబర్ 17 న ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఎన్నికలు -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలలో 113 సంఘాలు ఏకగ్రీవంగా అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 113 ప్రాదేశిక నియోజకవర్గాలు పరిధిలోని అన్ని ఏకగ్రీవం కావడం జరిగినట్లు, డిసెంబర్ 17 మంగళవారం ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు ఎన్నికల …
Read More »
Prajavartha Online Telugu News