Breaking News

Daily Archives: January 4, 2025

పోటీ తత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్ లలో విధ్యార్థులు భాగస్వామ్యం కావాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో నిమిడికృతమైన మేధస్సుకు పదును పెడతాయని, పోటీ తత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్ లలో విధ్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపు ఇచ్చారు. శనివారం శ్రీ సత్య సాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా – జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ “87 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టరు పి ప్రశాంతి, …

Read More »

మీ చెత్త.. మీదే బాధ్యత

-“స్వచ్ఛత సర్వేక్షన్ 2025” రిటర్న్ గిఫ్ట్ 2.0 కార్యక్రమం -వ్యర్థాలను రోడ్డు పై పడవేసినా టీ స్టాల్ కి రిటర్న్ గిఫ్ట్ -ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారి నుండి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుం వసూలు -మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం …

Read More »

ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు నందు జనవరి 5వ తేదీ ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంస్థాగత సామాజిక బాధ్యతగా, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గుండెపోటు, పక్షవాతం వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో మొదటి గంటలో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాలపై అవగాహన కల్పిస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల లక్షలాది మంది ఈ శిక్షణల ద్వారా ప్రాణాలను రక్షించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ క్రమంలో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు ప్రాంగణంలో ఉచిత …

Read More »

పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారు… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. స్థానిక హిందూ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న యువ కెరటాలు కార్యక్రమంలో శనివారం సాయంత్రం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన …

Read More »

భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మంత్రి జిల్లా కలెక్టర్తో కలసి శనివారం స్థానిక లేడీ యామ్థిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో …

Read More »

700 సర్వీస్ ప్రొవైడర్లకు జనవరి 15 నుండి ఉచిత నైపుణ్య శిక్షణ

-శిక్షణ కోసం విజయవాడ నగరపాలక సంస్థ యు.సి.డి విభాగం లో దరఖాస్తు చేసుకోగలరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐ వి పాలస్ నందు ఉదయమ్మ 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లంబర్లు, …

Read More »

షెడ్యూల్ కులాల డ్రాఫ్ట్ లిస్టు లో అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు షెడ్యూల్ కులాల సర్వేపై సామాజిక తనిఖీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ లిస్టును డిసెంబర్ 26, 2024వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ప్రచురించడం జరిగినది, ఇందుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో జనవరి 7, 2025 తారీకు లోపు మీ సంబంధిత సచివాలయాలలో రాతపూర్వకంగా అభ్యంతరములు తెలియజేయవలెను. అభ్యంతరములు అన్ని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత …

Read More »