Breaking News

Daily Archives: April 3, 2025

ఇసుక కొరత లేకుండా చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెమీ మెకనైజ్డ్ విధానంలో యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందామని …

Read More »

బందరు కోటను పర్యాటక సర్క్యూట్ లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని, బందరు కోటను పర్యాటక సర్క్యూట్ లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోటను, డచ్ల స్మశాన వాటికను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ బందరు కోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ, విజయవాడ సహాయ …

Read More »