Breaking News

Daily Archives: April 11, 2025

సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం రాకముందే సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని వారినీ స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకు వారి అడుగుజాడల్లో నడవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వలందపాలెం లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా …

Read More »

స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి సహకారం అందించండి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి వివిధ రాజకీయ పార్టీల …

Read More »

రాగ్ పిక్కర్స్ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రొఫైలింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మరియు స్వర్ణాంధ్ర కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాజరాజేశ్వరి పేట సానిటరీ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ నందు రాగ్ పిక్కర్స్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వారిచే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాగ్ పిక్కర్స్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వారు అందించే పథకాలైన నమస్తే పథకంతో వారికి ఎంతో మంచి చేకూరుతుందని, అందులో భాగంగా వారికి …

Read More »

వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 1 పరిధిలో గల గాంధీ హిల్, పరిసర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జెండా చెట్టు వద్దగల లోడర్ పాయింట్ పరిశీలించారు, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని రోడ్లపైన వ్యర్ధాలు ఎవరు వేయకుండా ఎప్పటికప్పుడు ఇంటి …

Read More »

దోమల నివారణకు ఫ్రైడే డ్రై డే కచ్చితంగా పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం రామకృష్ణ పురం, వార్డు-30,బుడమేరు కాలువ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి …

Read More »

సెలవు రోజుల్లో కూడా పనిచేయనున్న క్యాష్ కౌంటర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి.సృజన శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ, 2025- 26 సంవత్సరమునకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ, పండుగ రోజుల్లో కూడా ప్రజలు వినియోగించుకోగలరని అన్నారు. నగర …

Read More »

ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు MLA బొండా ఉమాకి ధన్యవాదాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతోకాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు మహిళలు MLA బొండా ఉమాకి ధన్యవాదాలు తెలిపారు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం 58, 59 డివిజన్ లోపలు కుటుంబాల వారికి ఇళ్ల పట్టాల పంపిణీ, మరికొందరికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకున్న వారిని శాలువాలతో సత్కరించి మహిళలకు చీరలు బహుకరించి ఇళ్ల పట్టాలను పంపిణీ …

Read More »

రిసోర్స్ పర్సన్ మహిళలు వారి సమస్యలు పరిష్కరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని నియోజకవర్గంలోని RP (రిసోర్స్ పర్సన్) మహిళలు వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మెప్మా సంస్థ RP లుగా తాము 15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నామని తాము ఇదివరకు గౌరవ వేతనము లేకుండానే పనిచేశామని, గత 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ …

Read More »

స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు హాలిడే మినహాయింపు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు శనివారం రోజు రెండవ శనివారం సెలవు దినాన్ని తొలగించినట్లు స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల సౌకర్యార్థం రేపు రెండవ శనివారం హాలిడేను తొలగించి యధా ప్రకారం రిజిస్ట్రేషన్‌లో కొనసాగే విధంగా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా తెలిపారు. రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకుంటున్న ఈ సమయంలో ప్రజలు ఇబ్బందికి గురుకాకుండా వుండేందుకు శనివారం సెలవు దినంగా తీసుకుంటే రెండవ రోజు ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవు దినాలు …

Read More »