గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జలధార పనులను జూన్ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా …
Read More »Daily Archives: June 1, 2026
ఘనంగా pre-convaction (ఫ్రీ కాన్వికేషన్) వేడుకలు
-అవార్డు గ్రహీతలను అభినందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవ వేడుకలు విజయవాడలో మంగళవారo జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి “pre convocation” సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.నరసింహన్, పి. సి. రాత్ ( విశ్వవిద్యాలయ డాక్టర్ ఆఫ్ సైన్స్ స్ ) అవార్డు …
Read More »అభివృద్ధి పనుల్లో జాప్యం అంగీకరించేది లేదు : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-విజయవాడ కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం -నియోజకవర్గ అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చ -అభివృద్ధి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు -ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని అధికారులకు హెచ్చరిక -ప్రభుత్వ హామీల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన -బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి అధికారి …
Read More »ఇళ్ల గణనను 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి
– నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జనాభా గణన–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో, మిగిలిన పనులను అత్యంత జాగ్రత్తగా, 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఇళ్ల …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …
Read More »గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ పురస్కారం
-UNIDO ‘జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్’ అవార్డు అందుకున్న కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిడో (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ప్రతిష్టాత్మక “జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్” అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో జరిగిన ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SC-IAP)’ ప్రాజెక్ట్ వర్క్‌షాప్‌లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ …
Read More »ఒకటో తేదీనే పెన్షన్.. పేదలకు కొండంత భరోసా
-గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల ప్రారంభంలోనే ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరడం పేదలు, వృద్ధులు, మరియు వికలాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసరావుతోట 69వ సచివాలయం పరిధిలో అచ్చి నాగేంద్రం అనే వికలాంగురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »నగరంలో ఈనెల 7న బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్ఠి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ వేద విజ్ఞాన పరిషత్ వెల్లడించింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పరిషత్ చైర్మన్ డి.వి. బాలసుబ్రమణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందర రామశర్మ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యాంశాలు…నిష్పాక్షిక వేదిక ఈ సమావేశానికి …
Read More »ఆత్మీయ పలకరింపు ఆర్థిక భరోసా లతో అనందహేళ..
-తొలిపొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ.. -జిల్లాలో 2,25,887 మంది లబ్ధిదారులకు రూ. 99 కోట్ల పంపిణీ.. -సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక ఆర్థిక భద్రత, జిల్లా కలెక్టర్ ఆత్మీయ పలకరింపులతో లబ్దిదారుల కళ్లలో ఆనందాన్ని నింపాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. సామాజిక భద్రత …
Read More »సమగ్ర సమాచారంతో అర్జీలను పరిష్కరించాలి..
-పునరావృత అర్జీలకు జిల్లా అధికారులదే బాధ్యత.. -సమస్యను స్పష్టతతో శాశ్వత పరిష్కారం చూపండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, ఆర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆరఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. …
Read More »
Prajavartha Online Telugu News