Breaking News

Daily Archives: June 3, 2026

ఏపీ మెడిక‌ల్ కౌన్సెల్ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ గార్ల‌పాటి నంద‌కిషోర్

-వైస్ ఛైర్మ‌న్‌గా కె.వెంక‌ట సుబ్బానాయుడు -విజయవాడలో జరిగిన ఎన్నికలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ మెడికల్ కౌన్సెల్ చైర్మన్ గా డాక్టర్ గార్లపాటి నందకిషోర్ (ఈఎన్టీ-గుంటూరు), వైస్-చైర్మన్ గా కె. వెంకట సుబ్బా నాయుడు (ఫల్మనాలజీ-ఒంగోలు) ఎన్నికయ్యారు. విజయవాడలోని కౌన్సెల్ కార్యాలయంలో బుధ‌వారంనాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మెడికల్ కౌన్సెల్ లో సభ్యత్వం కలిగిన వైద్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న 13 మంది, అంతకు ముందు కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎనిమిది మంది, ఎక్స్ అఫిషియో సభ్యులు …

Read More »

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) నిర్వహించిన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ విజయవంతమైంది. డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో నోటిఫై చేసిన 8 పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డీవీఎల్ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం మొత్తం 79 మంది అభ్యర్థులు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యారు. ఎంపిక ప్రక్రియ అనంతరం అన్ని ఖాళీలను …

Read More »

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

– రైతులకు న్యాయమైన ధర లభించేలా, నిరంతర కొనుగోళ్లకు అన్ని చర్యలు తీసుకుంటాం – నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లు చేయాలని ప్రాసెసింగ్ యూనిట్లను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు – తోత‌పూరి పరిస్థితులపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి అచ్చెన్న సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

డిఎస్సీ 2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం రాష్ట్ర హోంమంత్రి అనిత

-చిత్తశుద్ధి, ప్రజలకు జవాబుదారిగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది -డిఎస్సీపై ఎడాది పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు రాద్ధాంతం చేయడం హస్యాస్పదం -స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పబ్లిక్ డోమైన్ లో ఉంచాము -అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిఎస్సీ 2025ను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు వంగలపూడి అనిత అన్నారు.ఏపీ సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు జవాబుదారిగా పని చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం కనీసం ఒక్క …

Read More »

పుష్క‌రాల కోసం రూ.5.63 కోట్ల‌తో 3 స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రుల అభివృద్ధి

-కొవ్వూరు, నిడ‌ద‌వోలు, మండ‌పేట ఆసుప‌త్రుల్లో అద‌న‌పు సౌక‌ర్యాలు -ఆమోదించిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావ‌రి పుష్క‌రాల్లో భారీ స్థాయిలో పాల్గొనే ప్ర‌జ‌ల వైద్యావ‌స‌రాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 సెకండ‌రీ ఆసుప‌త్రుల‌ను అభివృద్ధి చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ దిశ‌గా కొవ్వూరు లోని ప్రాంతీయ ఆసుప‌త్రి, నిడ‌ద‌వోలు మ‌రియు మండ‌పేటలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌లో అద‌న‌పు నిర్మాణాలు, సౌక‌ర్యాల కోసం రూ. 5.63 కోట్ల వ్య‌యంతో ప్ర‌ణాళిక‌ను వైద్యారోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ …

Read More »

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలు

– ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఏపీ ప్రకృతి వ్యవసాయం – ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ సాధించిన APCNF… ప్రకృతి వ్యవసాయంలో ఏపీకి విశిష్ట స్థానం – దేశానికే గర్వకారణమైన ఈ గౌరవాన్ని మహిళలు, రైతులకు అంకితం చేస్తున్నాం – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, రైతాంగ అంకితభావానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య …

Read More »

విశాఖపట్నం పోర్ట్ లో ఎస్టీ రిజర్వేషన్ విధానం అమలుపై ఎన్‌సీఎస్టీ సమీక్ష

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు సంబంధించిన రిజర్వేషన్ విధానం అమలు, రక్షణ చర్యలు మరియు సంక్షేమ కార్యక్రమాలపై విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (ఎన్‌సీఎస్టీ) ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా మరియు కమిషన్ సభ్యులు పోర్ట్ అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు రిజర్వేషన్ విధానం సమర్థవంతమైన అమలుకు పోర్ట్ చేపడుతున్న చర్యలు, కార్యక్రమాలపై పోర్ట్ అధికారులు ప్రెసెంటేషన్ …

Read More »

సామర్థ్య వృద్ధి (Capacity Building) కార్యక్రమం నివేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 03 జూన్ 2026న Ratan Tata Innovation Hub (RTIH) విజయవాడ, ఎనికేపాడు కార్యాలయంలో NTR District Administration మరియు NTR District MSME Department సహకారంతో రెగ్యులర్ వీక్లీ MSME కార్యక్రమంలో భాగంగా సామర్థ్య వృద్ధి (Capacity Building) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో MEPMA అధికారులు, టెక్నికల్ నిపుణులు, TLF నాయకులు, CMMలు, COలు, RPలు, SHG సభ్యులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మొత్తం 136 మంది ఈ కార్యక్రమం ద్వారా …

Read More »

స‌ర్‌కు స‌హ‌క‌రించండి..

– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ప్ర‌తిఒక్క‌రి బాధ్య‌త‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తున్నామ‌ని.. ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంతానికి రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులను త్వరితిగతిన పూర్తి చేయాలి

-పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి -ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఆన్ లైన్ లో బిల్లులు కనిపించాలి -రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల అమలులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన …

Read More »