Breaking News

Daily Archives: June 5, 2026

2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం

-మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్ -డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, …

Read More »

రాష్ట్రంలో ఆక్వా రంగాభివృద్ధికి ఎకో సిస్టం – 6 ప్రాంతాలు కలుపుతూ కారిడార్

-బ్లూ ఎకానమీతోనే భవిష్యత్ – ఆర్ధికాభివృద్ధి సాధ్యం -కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో భూకేటాయింపులు -దేశాన్ని అగ్రపథాన నిలిపేలా అద్భుతంగా పని చేస్తున్న ప్రధాని మోదీ -సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు -కేంద్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం -రూ.72 కోట్లతో కాకినాడ పోర్ట్ ఆధునీకరిస్తామన్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు …

Read More »

కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బే సిటీ ప్రాజెక్టు

-ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు -విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీఈఆర్ పై …

Read More »

పర్యావరణం- ఆరోగ్య హితం కోసం సైకిల్

-తిరుగు ప్రయాణంలోనూ సైకిల్ పై సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన తిరుగు ప్రయాణంలోనూ సైకిల్ పై హెలిపాడ్ వరకూ ప్రయాణించారు. నోవోటెల్ హోటల్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా వైఎంసీఏ, వుడాపార్కు సర్కిల్ , పోలమాంబ గుడి మీదుగా ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సైకిల్ పై ప్రయాణించారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 17 నిమిషాల్లో సీఎం చేరుకున్నారు. దారిలో ప్రజలకు అభివాదం …

Read More »

నూజివీడు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో పాల్గొన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలోని నూజివీడుని స్వచ్ఛ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నూజివీడు పట్టణంలో పర్యటించారు. మున్సిపాల్టీ పరిధిలో రూ.2.80 కోట్ల వ్యయంతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ పనులను పర్యవేక్షించారు. డంపింగ్ యార్డ్ వద్ద ఇంకా మిగిలి ఉన్న చెత్తని త్వరగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. …

Read More »

సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ విజేతలకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు అందజేసిన ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బందరు రోడ్డులో గల ఆర్ ఎండ్ బీ బ్లాక్ లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్లు అందచేశారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్ షిప్ కు ఎంపిక అయిన ప్రతి అభ్యర్థికి ప్రతి నెలా రూ.10,000 స్టైఫండ్ ఇవ్వటంతో పాటు సైబర్ సెక్యూరిటీ భద్రతా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ …

Read More »

గొల్లపూడిలో లిటిల్ మిలీనియం స్కూల్ ప్రారంభం

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ మిలీనియం చిల్డ్రన్ ప్లే స్కూల్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం (సూర్య యాదవ్, హేమ దంపతులు) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని శాలువా పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లిటిల్ మిలీనియం వంటి సంస్థలు ఆధునిక …

Read More »

ప్రస్తుత ఖరీఫ్ లో సాగుకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి

-ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధనకు అవకాశం ఉన్న ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి -విత్తనాలు దగ్గర నుండి ధాన్యం కొనుగోలు వరకు అన్ని దశలలో రైతులకు అండగా నిలవాలి -జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం మరింత పెంచాలి -ప్రిఫర్డ్ వెరైటీస్ వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కలిగించాలి -ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనులు జూన్ 15వ తేదీలోగా పూర్తిచేయాలి..లేనిపక్షంలో కాంట్రాక్టర్ చెల్లింపులు నిలిపివేయాలి -ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 150 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి -జలధార-జలహారతి పనుల ద్వారా కాల్వలు, …

Read More »

22ఎ భూముల సమస్యకు విముక్తి కల్పించడం ఎంతో తృప్తినిచ్చింది.

-జిల్లాలో 1749 మంది లబ్దిదారులకు చెందిన 917 ఎకరాలు 22ఎ జాబితాను నుండి తొలగింపు.. -అర్హులైన ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పధకాలు చేరేలా చర్యలు కొనసాగుతాయి.. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎంతో కాలంగా రైతులు, సామాన్యులు ఎదురుచూస్తున్న 22ఎ భూముల సమస్యకు ప్రభుత్వం విముక్తి కల్పించడం ఎంతోమందికి భారీఊరటనిచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశం అనంతరం ఆయన …

Read More »

దిగ్విజయంగా ముగిసిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కేరళం పర్యటన

-ఏపీని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఎంపిక చేసి అవార్డు అందించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి/ తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల కేరళం పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అద్భుతమైన గమ్యస్థాన బ్రాండింగ్‌లో చూపిన ప్రతిభకు గాను ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డును తిరువనంతపురంలో అందించినందుకు గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026 నిర్వాహకులకు, …

Read More »