Breaking News

Daily Archives: June 5, 2026

అమరావతి ప్రతిష్ఠ పెంచిన ‘విట్’

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ప్రతిష్ఠ పెంచేలా విట్ -ఏపీ విశ్వవిద్యాలయం యాజమాన్యం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. విట్-ఏపీ యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను మంత్రి సవిత శుక్రవారం తిలకించారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్ పోటీలను తిలకించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, …

Read More »

అక్రమ రిజిస్ట్రేషన్ల పై 2వ రోజుకు చేరిన రిలే నిహార దీక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ రిజిస్ట్రేషన్లపై రెండవ రోజు కు చేరిన రిలే నిరాహార దీక్షలు స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో రెండో రోజు శుక్రవారం జరిగిన రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఏలూరు రంగబాబు మాట్లాడుతూ… మాది కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మండలం చిన్న గొల్లపాలెం గ్రామం, అని మా భూములపై వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా దొంగ దస్తావేజులు పుట్టిస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు అడంగల్ లో మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా, మా సంతకాలు …

Read More »

“నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం లో భాగంగా ఈ రోజు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విస్తృతంగా అనంత అరణ్యాలు (హై డెన్సిటీ ప్లాంటేషన్ ) ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకు తగ్గట్లు మొక్కల కోసం పిట్ డిగ్గింగ్ ( గొయ్యిల తవ్వకం ) జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయా …

Read More »

నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయా అని తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలను, ప్రమాణాలను పూర్తిగా పాటించిన బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు శుక్రవారం కమిషనర్ నగరంలోని బ్రాడీపేట, ఎల్ఐసి కాలనీ, పలకలూరు రోడ్, జేకేసీ కాలేజీ రోడ్, గోరంట్ల, రామిరెడ్డి నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

నిబంధనలకు అనుగుణంగా లేని ట్రావెల్ బస్ సీజ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు అనుగుణంగా లేని ట్రావెల్ బస్ సీజ్ చేయడం జరిగిందని రవాణా శాఖ ఉప కమిషనర్ కె.సీతారామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జబర్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన కె.ఎ 01 ఎ.ఎస్ 8804 నంబర్ బస్ నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాణాలు పాటించకుండా అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగిందని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్ ను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. నిబంధనల పట్ల సుప్రీం కోర్టు మార్గదర్శకాలు …

Read More »

జూలై 9, 10 తేదీల్లో విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 కార్యక్రమం జూలై 9,10 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతుందని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 (దక్షిణ రాష్ట్రల ఎడిషన్) ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …

Read More »

వర్చువల్ అకాడమీ కి డి. పి. ఆర్ సిద్ధం

-తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు తరహా లో తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటు కు డి.పి.ఆర్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ తెలిపారు. శుక్రవారం వడ్డేశ్వరంలోని అకాడమీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 45 దేశాలలో నివసిస్తున్న తమిళులకు వారి భాష నేర్పిస్తున్న తరహా లోనే రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

పది మొక్కలు నాటుదాం… పచ్చదనాన్ని కాపాడుదాం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాల్ లను తయారు చేశారు. మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో 11 వ రోజు ప్రజా దర్బార్

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 11వ రోజు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, …

Read More »

మెరుగైన వైద్యం కోసం నలుగురు బాధితులకు రూ28 లక్షల 97 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు , కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ వ డివిజన్ కంసాలి పేటకు చెందిన కొంగరపు దమయంతి (22) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది ప్రతికూల గర్భధారణ వలన శిశువు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …

Read More »