Breaking News

Daily Archives: June 5, 2026

పశ్చిమలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని వినతి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని భవానిపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధురాంతకం శ్రీనివాసరావు ఎమ్మెల్యే సుజనా చౌదరికి లేఖ రాసారు. వెల్డింగ్ , మరియు ఫాబ్రికేషన్స్ షాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక వర్కర్స్ కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎప్పుడూ ముందుంటారని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …

Read More »

కురిసిన వర్షాలకు తక్షణ స్పందన – నగరంలో నిల్వ నీటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో విజయవాడ నగర పరిధిలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర వైర్లెస్ సెట్ ద్వారా అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు (MRTs) వెంటనే అప్రమత్తమై, వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు, గల్ఫర్ మరియు ఎయిర్‌టెక్ యంత్రాలను తరలించాయి. ముఖ్యంగా బందర్ రోడ్డులోని సోనోవిజన్ సమీప ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని …

Read More »

డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం….

-మొక్కలు నాటిన రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్ ​ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని డా. ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ (డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్, అధికారులతో కలిసి ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ​ఈ సందర్భంగా రిజిస్ట్రార్ టి. సాయి సుధీర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పెరుగుతున్న …

Read More »

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మక ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను 75వ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ప్రారంభించినట్లు యువజన యువజన సంక్షేమ శాఖ ముఖ్యచారి నిర్వహణ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. జిల్లాలో ప్రతిష్టాత్మంగా అమలవుతున్న యూత్ టైం బ్యాంకు సేవలు ప్రభుత్వ వైద్యశాల మరియు ప్రజా ఫిర్యాదులు వేదిక కలెక్టరేట్ లో 75 రోజులు పాటు నిర్గురామంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీరీత్యా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు …

Read More »

నవచేతన కింద AI ఆధారిత బాలల అభివృద్ధి స్క్రీనింగ్‌పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవచేతన (AI Enabled Early Childhood Development Screening) కార్యక్రమం అమలులో భాగంగా, విజయవాడ అర్బన్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విజయవాడ అర్బన్ ICDS ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫేక్ రుక్సానా బేగం  మార్గదర్శకత్వం లభించగా, శ్రీమతి డి. జోష్నా, సీడీపీఓ, శ్రీమతి శివ దుర్గ భవాని, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, …

Read More »

ప‌చ్చని భూమి కోసం ప‌దిల‌మైన అడుగులు..

– ప్ర‌తి ఒక్క‌రూ చెట్లు నాటాలి.. వాటిని సంర‌క్షించాలి – ప‌ర్యావ‌ర‌ణం కోసం మ‌నం వేసే బాట భావితరాలకు భరోసా – క‌లెక్ట‌రేట్‌లో మొక్క‌లు నాటిని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌చ్చ‌ని భూమికోసం, భావిత‌రాల భ‌ద్ర‌త కోసం ప్ర‌తిఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ …

Read More »

ఈతతో పర్యావరణ సందేశం..

– కృష్ణమ్మ ఒడిలో కలెక్టర్ ల‌క్ష్మీశ వినూత్న చైతన్య కార్య‌క్ర‌మం – జ‌ల వ‌న‌రులు.. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌కు మూలాధారాలని వ్యాఖ్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కృష్ణా నదిలో ఈ ఒడ్డు నుంచి అవ‌త‌లి ఒడ్డుకు ఈదుతూ పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణపై వినూత్న సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద నుంచి క‌లెక్ట‌ర్ నదిని …

Read More »

గిరిజన విధ్యార్ధులు అన్ని రంగాల్లో రాణించాలి

-ప్రతిభకు ప్రోత్సాహం – గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి -గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఒక్కో విద్యార్థిపై రూ. లక్ష ఖర్చు -గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థుల్లో ఉన్న భయం, బిడియం, సంకోచాలను విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించాలని గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి …

Read More »

15 రోజుల యోగా పండ‌గ‌కు స‌ర్వం సిద్ధం

– ఈ నెల 7న పోలీస్ థీమ్ యోగా కార్య‌క్ర‌మం – ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో నిత్య యోగా – ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌-ఆరోగ్యాంధ్ర ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ నెల 7 నుంచి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ‌మైన 21వ తేదీ వ‌ర‌కు పండ‌గ‌లా యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంద‌ని.. జిల్లాలోనూ …

Read More »

పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై హోంమంత్రి అనిత ప్రయాణం..మొక్కలు నాటిన మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరప్పాడు రింగ్‌లోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ మెడోస్ నివాసం నుంచి ఆటోనగర్‌లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్‌పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి …

Read More »