Breaking News

Daily Archives: June 6, 2026

ఉండవల్లిలో రహదారులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ శనివారం ఉదయం రాజధాని అమరావతి- ఉండవల్లిలో పర్యటించారు. గ్రామంలోని మూల మలుపుల వద్ద రహదారి విస్తరించేందుకు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో..APCRDA సమాయత్తమైంది. ఈ ప్రణాళికల అమలుకై గ్రామంలో రహదారికి సమీపంగా ఉన్న పలు స్థలాలు, నివాస గృహాలను కార్తీక్, CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ తో కలసి పరిశీలించారు. గ్రామంలో పర్యటిస్తున్న అడిషనల్ కమిషనర్ వద్దకు పలువురు గ్రామస్తులు, రైతులు వచ్చి వారి సమస్యలను …

Read More »

సి‌ఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో శనివారం జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో స్కిల్ దునియా, APNRT, PVP స్టాఫింగ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్నో టాస్క్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 5 కంపెనీలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు 44 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో APNRT సంస్థకు 22, PVP స్టాఫింగ్ …

Read More »

రాజధాని అమరావతి నగర పరిధిలో ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన APCRDA

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా, అమరావతి జోనింగ్ నిబంధనల అమలులో భాగంగా APCRDA అధికారులు శనివారం ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించారు. డ్రైవ్‌లో భాగంగా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములపై ఉన్న అనధికార ఆక్రమణలను గుర్తించి తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న కంటైనర్లు, తాత్కాలిక షెడ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర నిర్మాణాలను APCRDA సిబ్బంది, సంబంధిత శాఖల …

Read More »

ప‌ర్యావ‌ర‌ణ మ‌నుగ‌డ అంద‌రి బాధ్య‌త‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తోనే మాన‌వాళి మ‌నుగ‌డ ముడిప‌డి ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్రాణంతో స‌మానంగా కాపాడుకోవాల‌ని అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ లేబ‌ర్ బి.అనితా వాణి అన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని వెంక‌ట‌పాలెంలోని చిగురు ఆశ్ర‌మంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఏపీ సీఆర్డీఏ – ఏడీసీ ఈఎస్ఎంయూ విభాగం ఆధ్వ‌ర్యంలో అనాధ బాల‌ల‌తో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆశ్ర‌మంలోని బాల‌ల‌కు పండ్లు, పండ్ల ర‌సాలు ఎల్ అండ్ టీ ప్ర‌తినిధులు …

Read More »

ఘనంగా రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవరం మంగోలు మరియు కృష్ణ ఫార్మసీ సొసైటీల ఆధ్వర్యంలో రైతులు మరియు డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా సొసైటీలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన చెక్కులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ “రైతులు మరియు డ్వాక్రా మహిళా …

Read More »

ఈ నెల 7 నుంచి యోగా పోటీలు..

– తొలిద‌శ‌లో గ్రామ‌, వార్డు స్థాయిలో ఉత్సాహంగా ఆరంభం – ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొనాలి – యోగాంధ్ర‌-2026ను విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతి వర్గానికి యోగా పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం నిర్వ‌హించే యోగాంధ్ర‌-2026లో భాగంగా ఈ నెల 7 నుంచి యోగా పోటీలు జ‌ర‌గ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ పోటీల్లో ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని …

Read More »

కొత్త జంటకు ఎమ్మెల్యే సుజనా పెళ్లి కానుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తన నియోజకవర్గ పరిధిలోని నూతన దంపతుల కోసం సుజనా పెళ్లి కానుక అందజేస్తున్నారు. ఆహ్వాన పత్రికను ఆయనకు పంపిన వారికి వధువుకు చీర, వరుడు కి ప్యాంటు-షర్ట్ స్వీట్ బాక్స్ తో పాటు పసుపు కుంకుమలు కానుకగా అందిస్తున్నారు. 46 వ డివిజన్ ,భీమన వారి పేటకు చెందిన షేక్ నజియా, నాగూర్ భాష(లేటు )దంపతుల కుమార్తె షేక్ సాదియా షేక్ రఫీ ల వివాహం శనివారం వాల్మీకి కళ్యాణ మండపంలో …

Read More »

మెరుగైన వైద్యం కోసం  రూ 11 లక్షల  ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను శనివారం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు,48 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ తో కలిసి అందజేశారు. 44 వ డివిజన్, రామ రాజ్య నగర్ కు చెందిన సంభాని గంగమ్మ (54) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …

Read More »

కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని వినతి…

-ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త ఆకుల శ్రీనివాసకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ డివిజన్, పెజ్జోనిపేట లో నిరుపయోగంగా ఉన్న సుమారు 5000 గజాల స్థలంలో ప్రజలకు ఉపయోగకరమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రముఖ సామాజిక వేత్త ఆకుల శ్రీనివాసకుమార్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెజ్జోనిపేటలో ఆకుల శ్రీనివాసకుమార్ శనివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. 2007 వ సంవత్సరం వరకు తమిళ …

Read More »

పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..

-ఎమ్మెల్యే సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ, నైజాం గెట్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం వన్ టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలను ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం …

Read More »