Breaking News

రేపు విజయవాడ నగరంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ కళాశాలలో యువ ఉత్సవ్ 2024

-జిల్లా యువత “యువ ఉత్సవ్ “ లో పాల్గొనండి నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి సుంకర రాము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ కళాశాలలో యువ ఉత్సవ్ 2024 జరుగుతుందని. ఈ యువ ఉత్సవ్ ( పంచ ప్రాణ్ అమృత్ కాల్ గోల్ ఆఫ్ డెవల్పెడ్ ఇండియా ఏట్ 2047 ) అనే థీమ్ అంశం పై పెయింటింగ్, కవితవ్యం, మొబైల్, ఫొటోగ్రఫీ, డిక్లేమసిన్, విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు కల్చరల్ ట్రెడిషనల్, ఫోక్ (గ్రూప్ ), సైన్స్ ఎకిబిషన్ మేళా పోటీలలో గ్రూప్, వ్యక్తిగత పోటీలు ఉంటాయని, ఈ పోటీలు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి కి పంపబడును గెలుపొందిన అలాగే గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు ఉంటాయన్నారు కావున ఎన్టీఆర్ జిల్లా లోని యువత ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అలాగే యువ ఉత్సవ్ లో వీరివి పాల్గొని జయప్రదం చేయాలనీ అయన కోరారు. యువ ఉత్సవ్ లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి https://forms.gle/Eh5AqWBdzVFjQ6Br7
లింక్ ను ఉపయోగించు కోవాలన్నారు. ఇతర వివరాములకు ఈ 9966357021 మొబైల్ నెంబర్ సంప్రదించలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *