Breaking News

ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన విజ‌య‌న‌గ‌రం ఎంపి కలిశెట్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌న‌గ‌రం ఎంపి క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు కు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలకటంతో పాటు శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఆ త‌ర్వాత క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం వీరిరువురు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. ఆ సమావేశాల్లో లేవ‌నెత్తాల్సిన అంశాలతో పాటు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి తీసుకురావాల్సిన నిధుల గురించి చర్చించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *