Breaking News

ఫోటో ఓటర్ల జాబితాను ఏలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా తయారు చేయాలి..

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫోటో ఓటర్ల జాబితాను ఏలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా తయారు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బిఎల్వోలను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన చల్లపల్లిలో ఎస్.ఆర్.వై.ఎస్.పి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన 61,62, 63 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులపై దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నడుస్తున్నది.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాక ఏమైనా దరఖాస్తు ఫారంలు 6,7,8 వచ్చాయా అని కలెక్టర్ విచారించారు. దరఖాస్తులు ఏమీ రాలేదని, చాలామంది ఓటర్లు ఎక్కువగా ఆన్లైన్లోనే దరఖాస్తులు పెట్టుకుంటున్నారని బిఎల్వోలు కలెక్టర్ కు సమాధానం చెప్పారు. అనంతరం స్వచ్ఛ సుందర చల్లపల్లిలో భాగంగా ఏర్పాటుచేసిన సామూహిక టాయిలెట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు ఎంతమంది ఈ టాయిలెట్లను వినియోగించుకుంటున్నారని, ఎలా నిర్వహిస్తున్నారని కలెక్టర్ అక్కడి వాచ్ మ్యాన్ ను అడగగా రోజుకు 300 మంది దాకా వస్తుంటారని ఒక్కొక్కరి నుండి 5 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నామని ఇస్తున్నారని కలెక్టర్ కు వివరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చల్లపల్లి ఇంచార్జ్ తహసిల్దార్ శ్రీలత బిఎల్వోలు ఎం గోపాలకృష్ణ జి రాజేంద్ర ఎం. ఆంజనేయులు ఆర్ ఐ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *