-గతంలో కంటే అదనంగా 21 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదన
-తూర్పు-పశ్చిమ గోదావరి ఎంఎల్ సి పట్టభద్రుల ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమీక్షించిన….
-డిఆర్ఓ టి. సీతారామమూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు-పశ్చిమ గోదావరి ఎంఎల్ సి పట్టభద్రుల ఓటర్లగా నవంబర్ 23 వ తేదీ నాటికి 51,624 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా తమ దరఖాస్తు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ ఛాంబర్ లో డిఆర్ఓ సీతారామమూర్తి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా తూర్పు-పశ్చిమ గోదావరి ఎంఎల్ సి పట్టభద్రుల ఓటర్ల గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దరఖాస్తులు నవంబర్ 23 వ తేది నాటికి 51,624 దరఖాస్తు వచ్చాయని, ఇందులో పురుషులు 30292 మంది, మహిళలు 21328 మంది ఇతరులు 14 మంది ఉన్నారన్నారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా డిసెంబర్ 9 వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. గతంలో కంటే అదనంగా 21 పోలింగ్ కేంద్రాలు పెరుగు తాయన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం షెడ్యూల్:
అభ్యంతరాలను దాఖలు చేయడానికి కాల వ్యవధి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వ తేది వరకు ఉంటుందన్నారు. క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలు సప్లిమెంట్‌లను పరిష్కరించే తేదీని సిద్ధం చేయడం జరుగుతుందని, డిసెంబర్ 25 వతేదిన ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ కాగా, పట్టభద్రుల ఓటర్ల తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30 వ తేదిన విడుదల చేయడం జరుగు తుందన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ అయ్యే ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా రాజకీయ పార్టీలు మాన్యుయేల్ ఓటింగు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మండలానికి కనీసం ఒక పోలింగ్ స్టేషన్‌ను ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. ఓటరు తన ఓటు వేయడానికి ప్రయాణించాల్సిన గరిష్టంగా అనుమతించదగిన దూరం 16 కి.మీ. ఉండాలన్నారు.
పోలింగ్ కేంద్రాలు అన్ని ప్రభుత్వం భవనాల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 4 పోలింగ్ స్టేషన్లు ఒక ప్రదేశంలో అనుమతించడం జరగదని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, పిడబ్ల్యుడి ఓటర్లకు ర్యాంప్‌లు వంటి కనీస ప్రాథమిక సౌకర్యాల లభ్యతను సమాకూర్చడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిపిఎం పార్టీ తరఫున కర్రి రామకృష్ణ, బీఎస్పీ పార్టీ తరఫున పులగల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News