Breaking News

మహారాష్ట్రలో సత్ఫలితాలు అందించిన పవన్ కల్యాణ్ ప్రచారం

-మహాయుతి నేతల హర్షాతిరేకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం కీలకమైన అంశం. జనసేనాని ప్రచారం చేసిన, రోడ్ షో నిర్వహించిన అసెంబ్లీ స్థానాల్లో లాతూరు సిటీ స్థానం మినహా అన్నింటా మహాయుతి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. 11 అసెంబ్లీ స్థానాలు, ఉప ఎన్నిక జరిగిన నాందేడ్ పార్లమెంట్ స్థానంలోని అభ్యర్థులకు మద్దతుగా వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం చేశారు. 10 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్ లోక్ సభ స్థానంలో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. నాందేడ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోక్ రావు మారుత్ రావు హంబర్దే విజయం దక్కించుకున్నారు. డేగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అంతపుకార్ జితేష్ రావ్ సాహెబ్, భోకర్ నుంచి జయశ్రీ అశోక్ రావ్ చవాన్, షోలాపూర్ సెంట్రల్ నుంచి  దేవేంద్ర రాజేశ్ కోటె, షోలాపూర్ నార్త్ నుంచి దేశ్ ముఖ్ విజయ్ సిద్ధరామప్ప, షోలాపూర్ సౌత్ నుంచి దేశ్ ముఖ్ సుభాష్ సురేష్ చంద్ర, బల్లార్ పూర్ నుంచి ముంగటివార్ సుధీర్ సచ్చిదానంద్, చంద్రాపూర్ నుంచి జోగేశ్వర్ కిషోర్ గజానన్, పుణె కంటోన్మెంట్ నుంచి సునీల్ ధ్యాన్ దేవ్ కాంబ్లే, కస్బాపేట్ నుంచి హేమంత్ నారాయణ్ రసానే, హడప్సర్ నుంచి చేతన్ విఠల్ తుపే తరఫున రోడ్ షోలు, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, మరాఠా ప్రజల ఐక్యత కోసం సుస్థిరమైన మహాయుతి కూటమికి పట్టం కట్టాలని మరాఠా ప్రజలను నిండు మనసుతో కోరారు. బహిరంగ సభల్లోనూ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే మహారాష్ట్ర అభివృద్ధి ఎంత అవసరమో, దానికి సమర్ధమైన పాలన ఇంకెంత అవసరమో చెబుతూ ప్రజల్లో చైతన్యం నింపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించారు. పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రతి సభకు మరాఠా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా షోలాపూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, కస్బాపేట్ లలో నిర్వహించిన రోడ్ షోలలో  పవన్ కళ్యాణ్ కి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దేశం కోసం నిత్యం ఆలోచించే పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి, సైద్ధాంతిక బలం, సనాతన ధర్మ రక్షణ కోసం ముందుకు నడిచే తీరు మరాఠా ప్రజలను సైతం ప్రభావితం చేసింది అనడంలో సందేహం లేదు. ఈ విజయాలకు పవన్ కళ్యాణ్ ప్రచారం ఎంతో దోహదం చేసిందని మహాయుతి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *