కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు షేక్ ఉమర్ కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ ను సోమవారం కమిషనర్ తమ చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ఇటీవల ఇంజినీరింగ్ విభాగం ఎల్ఎల్ఆర్ లో ఆప్కాస్ విధానంలో విధులు నిర్వహించే షేక్ ఉమర్ మృతి చెందారని, వారి కుటుంబ సభ్యులు షేక్ ముంతాజ్ బేగంకు ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షలు, మట్టి ఖర్చులు రూ.15 వేల చెక్ లని అందించామని తెలిపారు. అలాగే పిఎఫ్ కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *