విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోస్టల్ రీజియన్ సరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/ 12/2024 ລ້ 3.00 డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే .. రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది 29/112024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాఫ్), పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, గాంధీనగర్, విజయవాడ- 520003 అను చిరునామాకు పంపవలసినదిగా కోరడమైనది. ఫిర్యాదు దారులు వ్యక్తిగతంగా కూడా హాజరు కావొచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ వారు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News