అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ మంత్రి డోలా.బాలవీరాంజనేయ స్వామి కి ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.పురుషోత్తమనాయుడు, ఎ.విద్యాసాగర్ మరియు రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా.బాల.వీరాంజనేయ స్వామిని కలిసిన ఎ.పి.యన్.జి.జిఓ ల అగ్ర నేతలు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో అరగంటపాటు చర్చించారు. అనంతరం 22 అంశాలతో కూడిన వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కారం చేయాలని,ముఖ్యమంత్రితో జరగనున్న సమీక్ష సమావేశంలో ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కామన్ అపాయింట్ మెంట్ డేట్ ఇవ్వాలని,మెరిట్ కం రోస్టర్ విధానంలో సీనియారిటీ లిస్టులు తయారు చేయాలని,జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ మంజూరు చేయాలని,డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి నోష్నల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని,పదోన్నతులు కల్పించాలని,ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని,యన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఉద్యోగుల పై వత్తిడి లేకుండా చూడాలని,ప్రస్తుతం జరుగుతున్న వివిధ సర్వేలకు తగిన సమయం కేటాయించి ఉద్యోగులపై వత్తిడి తగ్గించాలని,విద్యావంతులైన సచివాలయ ఉద్యోగుల సేవలు ఉన్నంతంగా ఉపయోగించుకునేలా తగిన చర్యలు తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని నాయకులు మంత్రి ద్రుష్టికి తీసుకొని వచ్చారు. గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ సొసైటీ బిసి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగుల పదవి విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పంచే విషయాన్ని కూడా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.పురుషోత్తమనాయుడు,పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎ.విద్యాసాగర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.రమణ,రాష్ట్ర కోశాధికారి రంగారావు,గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News