-ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నాయి
-విజన్ 2047తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం
-గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సర్వనాశనమైంది
-యువత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి
-పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది
-కేంద్ర, రాష్ట్ర సబ్సిడీలతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
-విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్‌పో ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా, రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడ మెరుగుపడతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని ఎస్.ఎస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ బిజినెస్ ఎక్స్‌పోను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి సలహాలు సూచనలు అందించాలనే ఉద్దేశ్యంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల పరిశ్రమల ఏర్పాటుకు కూడా సానుకూల వాతావరణం ఉంది. సుమారు 900 కి.మీల సముద్ర తీరం ఉంది. తద్వారా పర్యాటకం, మత్స్య గుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు పుష్కలంగా అవకాశాలున్నాయి. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదు ఉపయోగించుకుని మరిన్ని మెరుగైన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మనం ఏదైనా సాధించాలనుకుంటే అందుకు విజన్ ఎంతో ముఖ్యమని, గతంలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విజన్ 2020 అందుకు నిదర్శనం. అప్పట్లో అందరూ విజన్ అంటే చూసి నవ్వుకున్నాగానీ, ప్రస్తుతం దాని ఫలాలు అనుభవిస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఐఎస్‌బీ లాంటి విద్యా సంస్థలు, మైక్రోసాఫ్ట్ లాంి కంపెనీలు రాష్ట్రానికి వచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అంతెందుకు 2014లో రాష్ట్రం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది.? అది కాదా విజన్ అంటే. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా.. తిరిగి కోలుకుంటామనే నమ్మకంతో రాష్ట్ర ప్రజానీకం ఉంది. అదే నమ్మకంతో విజన్ 2047 రూపొందించాం. రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక ప్రణాలికతో ముందుకు కదులుతున్నాం. చంద్రబాబు విజన్‌కు.. జగన్ రెడ్డి విధ్వంసానికి మల్లవల్లి ప్రాజెక్టు ప్రత్యక్ష నిదర్శనం.
యువత పారిశ్రామక రంగంలో అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే కోరుతున్నారు. ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన యువత ఎక్కడికో వెళ్లి అక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. మచిలీపట్నం నియోజకవర్గంలో త్వరలో పోర్టు నిర్మాణం పూర్తి కాబోతోంది. ఆ ప్రాంతంలో కూడా పెట్టుబడులు పెట్టి అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని యువ పారిశ్రామిక వేత్తలకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నాలెడ్జి హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఇప్పటికే ఏపీలో స్కిల్ సెన్సస్ కూడా నిర్వహించాం. టూరిజంలో కూడా అనేక ఉపాధి అవకాశాలున్నాయి. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని ఉద్యోగాలతో పాటుగా ఉపాధికీ పుష్కలంగా అవకాశాలున్నాయి. ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధికి వీలుగా పాలసీలు ప్రకటించాం. గత పాలకుల్లా.. విధ్వంసాలను కాకుండా.. అభివృద్ధి జరగాలని బలంగా కోరుకుంటున్నాం. విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా మార్చేందుకు పారిశ్రామిక వేత్తలు కూడా సహకారం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. అనంతరం ఎక్స్‌పోను ప్రారంభించారు. స్టాల్స్ అన్నింటినీ పరిశీలించారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సహకారం గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైనంతగా ప్రభుత్వ సహకారంతో ముందుకు కదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, విజయ డెయిరీ ఛైర్మన్ ఆంజనేయులు, ఏపీ ఛాంబర్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ఏపీ ఛాంబర్స్ టూరిజం కమిటీ వైస్ చైర్మన్ తరుణ్ కాకాని, పలువురు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News