Breaking News

విజయవాడ రూరల్ పరిషత్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మార్పు…


-డిగ్రీ బ్లాక్‌లో కొత్త స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు
-సీసీ కెమేరా నిఘా నీడలో పటిష్ట భద్రత చర్యలు
-పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్పుల తరలింపు
-బ్యాలెట్ బాక్సుల తరపరిశీలించిన కలెక్టర్ నివాస్, జేసీ శివశంకర్

విజయవాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీరు చేరిన విజయవాడ రూరల్ మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమన్న అధికారులు మార్చారు. విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల సమావేశ మందిరం మొదటి అంతస్తులోని బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూము జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య శనివారం మరోసారి ఓపెన్ చేశారు. అన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లోకి వాటిని తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కర్నెర్ జీ సూర్పసాయి ప్రవీణ్ చంద్, మండల ఎన్నికల అధికారి ఎం సునీల్ ఆధ్వర్యంలో మాంటిస్సోరిలోని డిగ్రీ బ్లాక్‌లోకి స్ట్రాంగ్ రూమ్‌ల‌ను మార్చారు. రెండు స్ట్రాంగ్ రూమ్లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతో బ్యాలెట్ బాక్సులకు ఎలాంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను మాంటిస్సోరి మహిళా కళాశాల కుమావేశ మందిరం మొదటి అంతస్తులోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్గాలకు స్ట్రాంగ్ రూమ్-2 పైకప్పు లీకై వర్షపునీరు బ్యాలెట్ బాక్సుల కిందకు చేరింది. దీంతో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ నివాస్, జేసీ శివశంకర్, మండల ఎన్నికల అధికారి సునీల్ స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లో నిడమానూరుకు చెందిన 107వ బ్యాలెట్ బాక్సులోకి నీరు చేరినట్లు గుర్తించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్లోకి నీరు చేరడంతోపాటు తేమ కూడా ఉండటంతో తక్షణమే కొత్త స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాశరావు, మండల ఎన్నికల అధికారి ఎం సునీల్, ఎంపీడీఓ జె సునీత, తహశీల్దార్ బీ సాయి శ్రీనివాస్ నాయక్ కొత్తగా డిగ్రీ బ్లాక్లో రెండు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 142 బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను రెండు స్ట్రాంగ్ రూమ్లలోకి మార్పించారు. అనంతరం రెండు రూమ్లకు అధికారులు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్ మార్చే కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థులు గేరా సుమన్, కె.సువర్ణరాజు, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు చండు సుబ్రహ్మణ్యం రాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు గంపా శ్రీనివాస్ యాదవ్, వైసీపీ మండల కన్వీనర్ దేవగిరి ఓంకార్ రెడ్డి. నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు దూరు రత్నం, జనసేన అభ్యర్థి లంకే సురేష్ టీడీపీ అభ్యర్థి బొమ్మసాన్ని అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *