-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం కృష్ణలంక జాతీయ రహదారి ని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో పర్యటించి ఆ ప్రాంతంలో గల షాపులకు ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారం చిన్నదైనా, పెద్దదైన, వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి ట్రేడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే వారిపై ఖఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.