విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువ ఉత్సవ్ కార్యక్రమం నేటి యువతరానికి స్పూ ర్తిదాయకంగా ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా, దేశభక్తిని పెం పొందించేందుకు ఉప యోగపడుతుందని పెనమలూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర , కృష్ణా మరియు వి ఆర్ ఎస్సి జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్- 2024″ కార్యక్రమం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టు బి యునివర్సిటీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పెనమలూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్ మాట్లాడుతూ యువతరం సానుకూల దృక్పథంతో పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. ఉరకలెత్తే ఉత్సాహం చూపించే యువతను చూస్తే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు.
విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టు బి యునివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యువతకు ఉద్బోధించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు యువ ఉత్సవ్లో భాగంగా ఇండియా 2047 నాటికీ దేశం ప్రపంచానికి దిక్సూచి లా ఉండాలన్నారు. అనంతరం విద్యా ర్థులు నిర్వహించిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టు కున్నాయి. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకులు వినోద్ కుమార్ జిల్లా అధికారులు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.