గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం, శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్, కెవిపి కాలనీ, సాయి నగర్, ఏసు భక్త నగర్, చుట్ట గుంట సెంటర్, రామనామ క్షేత్రం రోడ్, సంపత్ నగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను, ఎస్విఎన్ కాలనీలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది రికార్డ్ చేయాలన్నారు. ఎమినిటి కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పనులను ప్రతి రోజు పరిశీలించాలని, నాణ్యతలో లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. అలాగే అభివృద్ధి పనులకు సిద్దం చేసే అంచనాలను ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించాలన్నారు. చుట్టగుంట వాకింగ్ ట్రాక్ చుట్టూ లైట్లు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, ట్రాక్ పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఏఈని ఆదేశించారు. సంపత్ నగర్ ఎక్స్ టెన్షన్ లో వ్యర్ధాలు కుప్పలుగా వేస్తున్నారని, అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యర్ధాలను నాయుడుపేట డంపింగ్ పాయింట్ కి తరలించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్విఎన్ కాలనీలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను పరిశీలించిన అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ భవన నిర్మాణ సమయంలోనే ర్యాంప్ లు రోడ్ల మీదకు నిర్మాణం చేయకుండా నియంత్రించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. అలాగే జిఎంసి నుండి తీసుకున్న ఆమోదిత ప్లాన్ మేరకు నిర్మాణం జరుగుతన్నదీ లేనిదీ కూడా పర్యవేక్షణ చేయాలన్నారు.
పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు వెంకటేశ్వరరావు, రెహ్మాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం
–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …