విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు.
అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, పాలకమండలి సభ్యులు మరియు తెలంగాణా బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం తెలంగాణా బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు జమ్మిదొడ్డి నుంచి వివిధ కళాకారుల వేషధారణలు, కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలుతో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించు బంగారు భోణం తలపై ఉంచుకుని శ్రీ అమ్మవారి ఆలయమునకు కాలినడకన చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొని, అమ్మవారికి భోణం సమర్పించి, ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్ (ప్రధానార్చకులు), కనుగుల వెంకటరమణ, నెలబట్ల అంబిక, నేతికొప్పుల సుజాత, బండారు జ్యోతి, కత్తిక రాజ్యలక్ష్మి, నెరుసు సతీష్, కటకం శ్రీదేవి, చక్కా వెంకట నాగ వరలక్ష్మి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …