గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలు, వ్యాపార సంస్థలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పస్టం చేశారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీనివాసరావు తోట, నల్లపాడు రోడ్, ఆదర్శ నగర్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో ఆస్తి, నీటి పన్నులు చెల్లించని నివాసాలకు, కమర్షియల్ సంస్థలకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పన్నుల చెల్లింపు కీలకమని, నగరంలోని పన్నుదార్లు సకాలంలో పన్ను చెల్లించి జిఎంసికి సహకరించాలన్నారు. పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉండే వారికి జిఎంసి నుండి అందించే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజి కనెక్షన్ తొలగించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తొలగింపు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావుతోట, నల్లపాడు రోడ్, కెవిపి కాలనీ, నల్ల చెరువులోని పలు నివాసాలు, కమర్షియల్ సంస్థలు ఆస్తి పన్నుబకాయిలు పెండింగ్ లో ఉండడం, పలుమార్లు బకాయిల చెల్లింపు చేయాలని తెలిపినప్పటికీ చెల్లించని కారణంగా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లు తొలగించామని, తదుపరి కూడా స్పదించకుంటే విద్యుత్ కనెక్షన్, ఆర్.ఆర్. యాక్ట్ మేరకు జప్తు కూడా చేస్తామని తెలిపారు. అలాగే నల్లకుంట ఎదురు ఉన్న తాజ్ హోటల్ కి అనధికారికంగా ఉన్న మున్సిపల్ ట్యాప్ ని కూడా తొలగించామన్నారు.
Prajavartha Online Telugu News