Breaking News

విపత్తులు రాకముందే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూ అప్రమత్తం చేయాలి.

– ఆపద మిత్ర కమిటీని జిల్లాలలో ఏర్పాటు చేయాలి.
–  జిల్లాలలో ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రకృతి వైపరీత్యాల పై నివేదికలు సమర్పించాలి : రాష్ట్ర హోంమంత్రి  మతి వెలగపూడి అనిత.

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
బుదవారం సాయంత్రం మంగళగిరి సచివాలయం నుండి రాష్ట్ర హోంమంత్రి శ్రీ మతి వి.అనిత అన్ని జిల్లాల కల్లెక్టర్లు, ఎస్పిలతో మరియు సంబందిత అధికారులతో ముందస్తు చర్యల నిమిత్తం విపత్తుల నివారణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డి.ఆర్.ఓ నరసింహులు మరియు సంబందిత అధికారులతో కలసి జిల్లా సచివాలయం నుండి హాజరయ్యారు. జిల్లాల అధికారులతో హోంమంత్రి మాట్లాడుతూ వరదలు, విపత్తులు నివారణ పై మందుస్తు హెచ్చరికలు జారి చేయాలనీ వాటిపై జిల్లా అధికారులు సలహాలు సూచనలను కూడా తెలపాలని కోరారు. ప్రజలను అప్రమత్తం చేసి ఎటు వంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాద్యత అధికారుల పై ఉందని తెలిపారు. ఈ సైక్లోన్ వల్ల అనేక ప్రాంతాలలో ప్రజలతో పాటు జివాలు కూడా వరదలలో చిక్కుకొని కొన్ని జీవాలు నీటిలో కొట్టుకొనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. గతంలో కూడా సుమారుగా 290 తుపాను షెడ్లు పంచాయతిరాజ్ వారి అద్వర్యంలో ఉండేవి కానీ ఇప్పుడు అవి చాల వరకు మరమత్తులకు గురియయ్యని తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సి సెంటర్ 9 వున్నాయని అందులో ఒకటి విజయవాడలో వున్నదని తెలిపారు. సైక్లోన్ రావడానికి ఒక వరం ముందుగా సూచనలు వస్తాయి కావున తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి వారిని సంరక్షిత ప్రాంతాలకు తరలించి తగిన షెడ్ల ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు, జీవ రాసులకు కూడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ కు సంబందించిన చెరువుల ఆయకట్టులను పరిశిలించి అందులో ప్రమాదకరంగా ఉన్నవాటిని గుర్తించి వాటికీ తగిన మరమత్తులు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బందిచే తుఫాన్ ప్రాంతాలలో ముందస్తు చర్యలలో భాగంగా లోతట్టు ప్రాంతలలో వరదలు భూకంపాలు, సుడి గాలులు వచ్చే సమయం లో ప్రజలను అప్రమత్తం చేయడానికి అనువైన స్థలం లో అందరికి వినపడేలా సైరన్ ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆపద మిత్ర కమిటీని ప్రతి గ్రామం లో ఏర్పాటు చేసి గజ ఈత తెలిసిన యువకలను గుర్తించి వారిని సహాయచర్యలకు ఉపయోగించుకోవడానికి గుర్తింపు కార్డులను అందజేయాలని తెలిపారు. జిల్లా ప్రధానకేంద్రంలో తుఫాన్ వచ్చు సందర్భం లో సహాయక చర్యల నిమిత్తం ఆవసరమైన పరికరాలు( రోప్స్, జాకెట్స్) నిలువ ఉంచడానికి గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓవర్ ఫ్లో ఉన్న కాజ్ వేల పై ఇరువైపులా రోడ్లలకు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలను అటువైపు వెళ్ళకుండా అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ వల్ల వరదలు అధికంగా ప్రవహించడం తో కొన్ని చోట్ల రోడ్లు, కాజ్ వేలు దెబ్బ తిన్నాయని వాటిని పరిశిలించి తగిన సహాయక చర్యలు చెప్పట్టామని, ఓవర్ ఫ్లో ఎక్కువ ఉన్న కాజ్ వేల పై ఇరువైపులా రోడ్లలకు రోపులతో బందోబస్తు చేసామని అటువైపు ప్రజలు ఎవరు వెళ్ళకుండా స్థానిక విఆర్వో, సచివాలయ సిబ్బందిని మరియు పోలీసు వారిని నియమించమని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *