Breaking News

నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని, జి.ఒ.ఎం.ఎస్‌.నెం-114ను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ కోరింది. బుధవారం ధర్నాచౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు బి.ఎస్‌.ఆర్‌.శర్మ, జనరల్‌ సెక్రెటరీ బి.జె.గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జి.ఓ.ఎం.ఎస్‌.నెం. 114ను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరు. క్రమబద్ధీకరణ అయ్యారు దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థలోని కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదన్నారు. ప్రభుత్వం అధికారులకు అనేక సార్లు తమ గోడును వెళ్ళగ్రక్కుకున్నా, వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో దశల వారి కార్యక్రమం ప్రకటించి దేవుడే దిక్కని పిఠాపురం, మంగళగిరి, కుప్పంలో లక్ష్మీగణపతి హోమాలు ద్వారా ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరణ చేయాలని వేడుకున్నామని అయినా ఫలితం విషయంలో జాప్యం జరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చామన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నామన్నారు. అనేక మంది కుటుంబాలు దీనిపై ఆధారపడి వున్నారని వీరిని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికి స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మా పోరాటానికి ఉద్యోగ ఉపాధ్యాయ ఆధ్యాపక సంఘాలు పూర్తి మద్దత్తును తెలియజేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా మా విన్నపాన్ని గమనించి వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ఈ నిరసన దీక్ష ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఓ.రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి.ఎం.దయాకర్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ జి.సాయికిరణ్‌, జి.జక్కన్న, వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.విజయ భేరీ, సెక్రెటరీ ఎస్‌.లత, సిహెచ్‌ విజయశ్రీ, పి.లక్ష్మీ, స్వాతి మరియు అసోసియేషన్‌ మెంబర్స్‌ వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *